రవితేజ చిత్రం రిలీజుకు రోజానే అడ్డంకి?
చిరకాల విరామం తర్వాత రోజా ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నిలుచున్న చిత్రం 'శంభో శివ శంభో'. రోజా రీఎంట్రీతో ఎంతో కొంత క్రేజు వస్తుందని భావిస్తే ఆమే ఈ చిత్రం రిలీజు కు అడ్డంకిగా మారింది. రవితేజ, ప్రియమణి కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం లేదు. ఈ చిత్రం పైనా తెలంగాణవాదులు గుర్రుగా ఉన్నారు. ఈ సినిమాలో రోజా నటించడమే అందుకు కారణం. సమైక్యాంధ్రకు జై అనడమే కాక కేసీఆర్‌ను విమర్శించిన రోజా నటించినందున ఈ సినిమాను తెలంగాణలో ఆడనివ్వబోమని తెలంగాణవాదులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో దీని విడుదలపై కూడా అనిశ్చితి నెలకొంది. దాంతో 'శంభో శివ శంభో'ను సంక్రాంతికి విడుదల చేస్తానని ప్రకటించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ డైలమాలో పడ్డట్టు సమాచారం. రవితేజతో పాటు అల్లరినరేశ్, శివబాలాజీ కూడా హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా తమిళంలో హిట్టయిన 'నాడోడిగళ్' అనే సినిమాకు రీమేక్.రెండు రోజుల క్రిందట ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications











