Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బాలయ్యతో ఓకే కానీ.. దానికి మాత్రం నాట్ ఓకే.. బోయపాటితో రోజా చెప్పింది ఇదేనా.!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ. అదే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తన మార్కును చూపిస్తున్నారు. అందుకే క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే.. మరోవైపు పొలిటికల్ ఇష్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజకీయ ప్రత్యర్థి అయిన రోజాతో కలిసి సినిమా చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...
Recommended Video
బాలయ్య దృష్టి అంతా దీని పైనే
ప్రస్తుతం బాలకృష్ణ.. కేఎస్ రవికుమార్‌తో కలిసి చేసిన ‘రూలర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌పై బాలయ్య దృష్టి సారిస్తున్నారు. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.
అక్కడ పెద్ద దిక్కు అయిన రోజా
రోజా విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు. కానీ, ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న ‘జబర్ధస్త్' షోకు మాత్రం జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీని నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడంతో ఈ షోకు ఆవిడే పెద్ద దిక్కు అయ్యారు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ నుంచి తప్పుకోవాలనుకోవడం లేదని ఆమె అంటున్నారని టాక్.
వీళ్లిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్
ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నందమూరి బాలకృష్ణ, సీనియర్ హీరోయిన్ రోజా కాంబినేషన్లో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. వీళ్లిద్దరి కలయికలో ‘బొబ్బిలి సింహం', ‘భైరవ ద్వీపం', ‘పెద్దన్నయ్య', ‘మాతో పెట్టుకోకు' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. దీంతో ఈ కాంబినేషన్‌కు సూపర్ హిట్ పెయిర్ అని పేరుంది.
బాలయ్యతో మరోసారి సినిమా
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కలయికలో గతంలో ‘సింహా', ‘లెజెండ్' అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. వీటి తర్వాత ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. బోయపాటి ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇందులో రోజా నటిస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
బోయపాటితో రోజా చెప్పింది ఇదేనా
ఈ సినిమాలో రోజా నటిస్తుందా లేదా అన్న దానిపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. బాలయ్య సినిమాలో నటించేందుకు రోజా సిద్ధంగానే ఉన్నారట. అయితే, బోయపాటి చెప్పిన పాత్రకు మాత్రం ఆమె రెడ్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆమె.. బోయపాటికి సూటిగా చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది.