వైసీపీకి సినీనటి రోజా సెల్వమణి గుడ్ బై? సోషల్ మీడియాలో జబర్దస్త్‌గా తేల్చేసిన మాజీ మంత్రి!

సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, జబర్దస్త్ మాజీ హోస్ట్ రోజా సెల్వమణి గత కొద్దికాలంగా పాలిటిక్స్‌కు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో దారుణమైన ఓటమి తర్వాత ఆంధ్రా రాజకీయాలకు దూరంగా ఉంటూ కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో వ్యవహరించిన తీరు ఆసక్తికరమైన చర్చకు, అనేక ఊహాగానాలకు తెరలేపాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్లకుపైగా రోజా సెల్వమణి కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు టీడీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె స్వర్గీయ వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్లాన్ చేశారు. ఆ చర్చలు జరుగుతుండగానే.. వైఎస్ అకాల మరణం చెందడంతో కొంత బ్రేక్ పడింది.

Roja Selvamani removed YSRCP name from Social media accounts is she good by to YS Jagan Party

అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన అనేక పరిణామాలు, వివాదాల అనంతరం ఆమె వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఓ దఫా ఎమ్మెల్యేగా ఎన్నిక మంత్రిగా సేవలందించారు. అయితే రోజా ప్రవర్తన, వ్యవహరశైలిలో పార్టీలోని ఓ వర్గం, అలాగే నగరి నియోజకవర్గంలో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో దాదాపు అజాతవాసంలోకి వెళ్లిపోయారు.

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చరుకుగా వ్యవహరించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం ఆమె తన సోషల్ మీడియా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించారట. కేవలం మాజీ మంత్రి అని మాత్రం ఉంచుకొన్నారు. అయితే పార్టీ పేరు తొలగించడంతో ఆమె వైసీపీకి ఆమె గుడ్ బై చెప్పబోతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

Roja Selvamani removed YSRCP name from Social media accounts is she good by to YS Jagan Party

ఇప్పటికే రోజా వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఏపీ పాలిటిక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదు. ఇక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైఎస్ఆర్ సీపీ పదాన్ని తొలగించడంపై అలాంటి సంకేతాలు ఇచ్చారనే విషయం సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకొన్నారు. ఇంతకు ముందు ఆమె అకౌంట్లలో వైసీపీ పేరు ఉందా? ఇటీవలే ఆమె తొలగించిందా? ఎందుకు తొలిగించారనే ప్రశ్నలు భారీగా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: roja selvamani ysrcp ys jagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X