చిరంజీవితో ఫైర్ బ్రాండ్ రోజా ఢీల్: సెంటిమెంట్‌తో కొట్టేందుకు భారీ ప్లాన్.!

By Manoj

సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సత్తా చాటుతోన్న వారిలో ఫైర్ బ్రాండ్ రోజా ఒకరు. సాదాసీదా అమ్మాయిగా తెలుగు సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె... తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అందంతో పాటు అభినయంలోనూ రాణించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే దక్షిణాది భాషల్లోని అందరు హీరోలతో నటించి మెప్పించారు. ఇక, కొన్నేళ్లుగా సినిమాలకు దూరమై.. రాజకీయాలపైనే ఫోకస్ చేస్తున్న ఆమె.. తాజాగా చిరంజీవితో కలిసి భారీ ఢీల్ కుదుర్చుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

మొదటి ప్రయత్నమే సూపర్ సక్సెస్

మొదటి ప్రయత్నమే సూపర్ సక్సెస్

చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీలత రెడ్డి అలియాస్ రోజా 1991లో విడుదలైన ‘సర్పయాగం'తో సినిమా రంగంలోకి ప్రవేశించింది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించింది. దీంతో ఆమెకు నంది అవార్డ్ కూడా దక్కింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది. అదే సమయంలో దక్షిణాదిలోని మిగతా భాషల్లోనూ సినిమాలు చేసింది.

సెకెండ్ ఇన్నింగ్స్ కూడా అదరగొట్టింది

సెకెండ్ ఇన్నింగ్స్ కూడా అదరగొట్టింది

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా... క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ దుమ్ముదులిపేసింది. అవకాశాలు సన్నగిల్లుతోన్న సమయంలో ‘శంభో శివ శంభో' అనే సినిమాలో చక్కని పాత్రను పోషించింది. ఆ తర్వాత వరుసగా సహాయ నటి పాత్రలు దక్కించుకుంది. కెరీర్ ఊపందుకుంటోన్న సమయంలో రాజకీయాల కోసం సినిమాలకు దూరమైపోయిందీ సీనియర్ హీరోయిన్.

అక్కడ కూడా ఎంట్రీ.. జబర్ధస్త్‌గా కెరీర్

అక్కడ కూడా ఎంట్రీ.. జబర్ధస్త్‌గా కెరీర్

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రోజా... బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘మోడ్రన్ మహాలక్ష్ములు' అనే షోతో ఆరంగేట్రం చేసిన ఆమె... ఫేమస్ కామెడీ షో ‘జబర్ధస్త్'తో క్రేజ్ దక్కించుకుంది. మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... ఏడేళ్లుగా జబర్ధస్త్‌కు జడ్జ్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ షోకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.

రోజాకు పాలిటిక్స్‌లోనూ తిరుగులేదు

రోజాకు పాలిటిక్స్‌లోనూ తిరుగులేదు

సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ ఎంటర్ అయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆమె.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది.

బాలయ్య.. అల్లు అర్జున్‌తో ఫైటింగ్

బాలయ్య.. అల్లు అర్జున్‌తో ఫైటింగ్


ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న రోజా... ముఖానికి మరోసారి మేకప్ వేసుకోబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ప్రతినాయిక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదే సమయంలో బన్నీ నటిస్తున్న ‘పుష్ప'లోనూ అదే తరహా పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిరంజీవితో ఫైర్ బ్రాండ్ రోజా ఢీల్

చిరంజీవితో ఫైర్ బ్రాండ్ రోజా ఢీల్

సినిమాల్లో చేసేందుకు రోజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త బయటకు వచ్చిన నేపథ్యంలోనే... ఆమె గురించి మరో న్యూస్ తాజాగా ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం... ఈ ఫైర్ బ్రాండ్.. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘లూసీఫర్' రీమేక్‌లో కీలక పాత్ర పోషించబోతుందట. ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం వల్లే దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

Recommended Video

Prabhas Special Request To Ram Charan
సెంటిమెంట్‌తో కొట్టేందుకు భారీ ప్లాన్.!

సెంటిమెంట్‌తో కొట్టేందుకు భారీ ప్లాన్.!


‘ముఠామేస్త్రి', ‘ముగ్గురు మొనగాళ్లు', ‘బిగ్ బాస్' వంటి సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు చిరంజీవి రోజా. అయితే, ‘లూసీఫర్' రీమేక్‌లో మాత్రం అన్నా చెల్లెలిగా కనిపించబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి ఈ పాత్ర కోసం విజయశాంతి, కుస్భుూ తదితర హీరోయిన్లను అనుకున్నా... రోజా అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X