మెగా హీరోతో కయ్యానికి కాలు దువ్వుతోన్న రోజా.. అతడిని ఢీ కొట్టేందుకు మాస్టర్ ప్లాన్.!
రోజా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పరిచయం చేయనవసరం లేని పేరిది. 'ప్రేమ తపస్సు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఆమె... తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అప్పటి బడా హీరోలు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆమె తన హవా చూపిస్తోంది. ఏకంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రోజా.. మెగా హీరోతో కయ్యానికి కాలు దువ్వుతోందని ఓ వార్త లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

గ్లామర్.. యాక్టింగ్.. టాప్ హీరోయిన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన స్టార్‌డమ్‌ను కొనసాగించింది సీనియర్ హీరోయిన్ రోజా. కెరీర్ ఆరంభం నుంచి పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే చేసిన ఆమె.. మధ్యలో గ్లామర్ పాత్రలు కూడా పోషించి కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. ఈ రెండింట్లో రాణిస్తూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులను సైతం అందుకుంది.

అలాంటి పాత్రలు కూడా పోషించింది
హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ సత్తా చాటింది. ఇక, కొత్త తరం వాళ్లు వస్తున్న నేపథ్యంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించింది. వాటిలో చాలా వరకు పవర్‌ఫుల్ రోల్స్ ఉన్నాయి. 2013 తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది.

జబర్ధస్త్‌గా ఎంట్రీ... ఆమెదే కీలక పాత్ర
సినిమాలకు దూరమైన తర్వాత ‘జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా రోజా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షోకు జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక, నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఒంటి చేత్తో షోను నడుపుతోంది. అలాగే, ‘మోడ్రన్ మహాలక్ష్ములు', ‘నాచోరే', ‘రేస్', ‘రచ్చబండ', ‘బతుకు జట్కాబండి' సహా ఎన్నో షోలలో కీలక పాత్రలు పోషిస్తోంది.

రాజకీయాల్లో సక్సెస్.. రెండు సార్ల విన్
సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ ఎంటర్ అయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆమె.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది.

బాలయ్యను టార్గెట్ చేస్తున్న రోజా
సుదీర్ఘ విరామం తర్వాత రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసే సినిమాల గురించి ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో రోజా.. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తుందని అన్నారు. తర్వాత ఇది అబద్ధమని తేలింది.
Recommended Video

మెగా హీరోతో కయ్యానికి రోజా రెడీ
తాజాగా రోజా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘పుష్ప' మూవీలో ఆమె ప్రతినాయకురాలి పాత్రను పోషిస్తోందట. ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం వల్లే దీనికి రోజా ఓకే చెప్పేసిందని ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











