గోపీచంద్ ని ఉద్దేశిస్తూ రోజా వల్గర్ కామెంట్స్
తాజాగా జరిగిన గోలీమార్ ప్రెస్ మీట్ లో రోజా..గోపీచంద్ ని ఉద్దేశించి అన్న మాటలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ మీడియాలోనూ చర్చకుదారి తీసాయి. గోపీచంద్ క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుందని దర్శకుడు చెప్పగానే ఆమె ప్రియమణి వైపు తిరిగి కన్నుగీటి గోపీది ఢిఫెరెంట్ గా ఉంటుందా అనటం అందరికీ వినిపించింది. దాంతో ప్రియమణి సిగ్గుతో చిరునవ్వు నవ్వటం..అందరి కళ్ళల్లో పడింది. స్టేజీ మీదే అలా మాట్లాడటం అక్కడున్నఒకరిద్దరిని ఇబ్బందిపెట్టినా చాలా మంది ఎంజాయ్ చేసారు. ఇక రోజా ఇలా సరదాగా ఏదో ఒకటి అనటం కామన్ అని అని మరికొందరు అంటున్నారు. ఇక రోజా రూట్ లోనే ఛార్మి కూడా ఆడియో పంక్షన్స్ లోనూ, ప్రెస్ మీట్ లలో సెటైర్స్, జోక్స్ కట్ చేస్తూంటుంది, అది ఒక్కోసారి దర్శక,నిర్మాతలకు కక్కలేక, మింగలేని పరిస్ధితి తెచ్చిపెట్టి నవ్వుతెచ్చిపెట్టుకుంటారని అంటున్నారు.
పూరీ జగన్నాధ్ రోజా గురించి మాట్లాడుతూ..రోజా, రమ్యకృష్ణలతో సినిమాలు చేయలేదని నాకు లోటుగా అనిపించేది. ఈ సినిమాలో రోజాతో కలిసి పనిచేసినందుకు ఆనందంగా వుంది. ఈ చిత్రంలో ప్రేక్షకులు రెబల్‌రోజాను చూస్తారు' అన్నారు. ఇక రోజా మాట్లాడుతూ..బెల్లంకొండ తీసిన శంభో శివ శంభో చిత్రంతో సినిమాల్లో రీ ఎంట్రి ఇచ్చాను. వెంటనే ఆ బేనర్‌లోనే మరో సినిమా చేయడం, అందునా పూరీ లాంటి దర్శకుని చిత్రంలో నటించడం ఆనందంగా వుంది' అన్నారు. ఈ సమావేశంలో ప్రియమణి, చక్రి, భాస్కరభట్ల రవికుమార్ కూడా పాల్గొన్నారు.ఇక గోపీచంద్, ప్రియమణి కలిసి నటించిన 'గోలీమార్' చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











