»   » పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ డేటింగ్...!

పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ డేటింగ్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోయిన్ కొహ్లితో డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న'ది షాడో" మూవీలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించిన 'సారాజెన్ దియాస్" ప్రస్తుతం భారత యువ క్రికెటర్ విరాట్ కొహ్లితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందట. రీసెంట్ గా బెంగళూరులో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన ఒక పార్టీలో వీళ్ళిద్దరూ కలిశారట.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రూల్ ప్రకారం అప్పటి నుండి సారాజైన్, విరాట్ కొహ్లీ ఇద్దరూ చాటు మాటుగా కలుసుకొంటూ డేటింగ్ లో ఉన్నారట. వీళ్లిద్దరినీ చాలా మంది చాలా ప్రదేశాల్లో చూశారట. అంతుకు ముందు చాటు మాటుగా కలుసుకునే వీళ్ళిద్దరూ ఇప్పుడు బహిరంగంగానే కలుసుకుంటున్నారట. గతంలో క్రికెటర్ రవిశాస్త్రి, సినీ నటి అమృతా సింగ్ లు కూడా ఇలాగే డేటింగ్ చేశారు. కానీ వీళ్ళిద్దరూ కలిసుండలేక పోయారు. మరి సారాజేన్, విరాట్ కోహ్లీల ప్రేమ పెళ్ళి మండపం వరకూ వెళుతుందా..?లేక ఇదేదో టైమ్ పాస్ ప్రేమలా మిగిలిపోతుందా అనేది కాలమే చెప్పాలి.

English summary
Another romantic relationship is brewing between Indian cricketer and Bollywood star. Ace cricketer Virat Kohli is believed to be dating the Hindi film actress Sarah Jane. Sarah, who is playing lead in the forthcoming flick ‘Game’, is said to be in love with Kohli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu