పుష్ప 2లో సెన్సేషన్‌గా శోభనం సీన్.. తెలుగులో ఎప్పుడూ చూపించని విధంగా!

ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి అయినా ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సెన్సేషనల్ హిట్లను సొంతం చేసుకుంటాయి. అలాంటి వాటిలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప ది రైజ్' ఒకటి. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విజయాన్ని అందుకుంది.

'పుష్ప ది రైజ్' సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తీస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో జోష్‌తో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్లు చేస్తున్నారు.

Romantic Scene Highlight In Allu Arjun Pushpa The Rule

దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన 'పుష్ప ది రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు, మొదటి పాటలకు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. దీనికితోడు ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక వార్త లీక్ అవుతూనే ఉంటోంది.

సాధారణ కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో డాన్‌గా పుష్ప రాజ్ ఎలా మారాడు అనే పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్నీ హై రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా మధ్య వచ్చే శోభనం సీన్ హైలైట్‌గా ఉండబోతుంది అని తెలుస్తోంది.

Romantic Scene Highlight In Allu Arjun Pushpa The Rule

'పుష్ప ది రైజ్' మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా పెళ్లితో ఎండ్ కార్డ్ వేశారు. ఇక, ఇప్పుడు వీళ్లిద్దరి ఫస్ట్ నైట్ సీన్‌తో 'పుష్ప ది రూల్' సినిమాను ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉండేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తైందట. మొత్తంగా ఇది తెలుగులో గతంలో చూడని విధంగా ఉంటుందట.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X