Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెలుగులోనూ శృంగార సన్నివేశాలు: చర్చనీయాంశం అవుతోన్న బాలీవుడ్ రీమేక్ అప్డేట్.!
కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీమేక్ మూవీల హవా కనిపిస్తోంది. ఇతర భాషల్లో విడుదలై భారీ విజయాలను అందుకున్న చిత్రాలను తెలుగులోకి అనువదించేందుకు ఇక్కడి ఫిల్మ్ మేకర్లు, హీరోలు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయా సినిమాల హక్కులను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టిన ఓ సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో తీసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా రీమేక్ చేయబోతున్నాడు. దీంతో అందులోని శృంగార సన్నివేశాల గురించి ఓ చర్చ తెరపైకి వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!
వాటినే ఇక్కడ కూడా దించేస్తున్నారు
ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలను రీమేక్ చేశారు. వాటిలో చాలా వరకు అక్కడ ఎలా తీశారో.. ఇక్కడ కూడా అదే దించేశారు. కథలో ఫీల్ మిస్ అవకూడదనే ఇక్కడి దర్శకులు ధైర్యం చేయడం లేదన్న టాక్ ఉంది. అందుకే రీమేక్ సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రీమేక్‌లు తెరకెక్కుతున్నాయి.
మన వాటికి కూడా ఫుల్ డిమాండ్
కేవలం టాలీవుడ్లోనే రీమేక్‌లు రావడం లేదు.. భారతదేశంలోని అన్ని భాషల వాళ్లు మన సినిమాలను రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో తెలుగు సినిమాలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఈ మధ్య వచ్చిన పలు చిత్రాలు కూడా దక్షిణాదితో పాటు పలు భాషల్లోకి వెళ్తున్నాయి.
చిరంజీవి, పవన్ కూడా అదే దారిలో...
కొన్నేళ్ల క్రితం రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కూడా తమిళ కథను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మాత్రమే కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్' సినిమాను రీమేక్ చేస్తున్నారు. వీరితో పాటు పలువురు యంగ్, సీనియర్ హీరోలు సైతం రీమేక్లతోనే ముందుకు వెళ్తున్నారు.
యంగ్ హీరో చేతికి సూపర్ హిట్ మూవీ
2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘అంధాధున్'. హిందీలో వచ్చిన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా రీమేక్ హక్కులను టాలీవుడ్ యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ నితిన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తెలుగులోనూ శృంగార సన్నివేశాలు
‘అంధాధున్' మూవీలో ఆయుష్మాన్ ఖురానా - రాధికా ఆప్టే మధ్య కొన్ని శృంగార సన్నివేశాలు ఉంటాయి. అలాగే, టబుతో సైతం పలు అభ్యంతరకరమైన సంభాషణలు పెట్టారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ ఈ సీన్స్ ఉంటాయని తాజాగా ఓ వార్త లీక్ అయింది. మేర్లపాక గాంధీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నారు.
Recommended Video
ఆ సీన్స్ చేసే వారి కోసం అన్వేషణ
బాలీవుడ్లో బోల్డ్ క్యారెక్టర్ చేసిన రాధికా ఆఫ్టే, టబును తెలుగులో ఎవరు భర్తీ చేయబోతున్నారన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే టబు పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, రాధిక పాత్రలో ఎవరు కనిపించబోతున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. దీని కోసం చిత్ర యూనిట్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.