RRR నుంచి లేటెస్ట్ అప్‌డేట్: వాళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్.. జక్కన్న ప్లాన్

By Manoj

'బాహుబలి' వంటి సంచలన సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడానికి తోడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన యాక్టర్లతో పాటు టెక్నీషియన్లు పని చేస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.

 డెబ్బై శాతం పూర్తయిన షూటింగ్

డెబ్బై శాతం పూర్తయిన షూటింగ్

దాదాపు ఏడాది క్రితం RRR ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఇందులో నటిస్తున్న హీరోలు రామ్ చరణ్, తారక్ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, రాజమౌళి తన వ్యక్తిగత విషయాల కోసం విశ్రాంతి తీసుకోవడం, తర్వాత హీరోయిన్‌ ఆలియాకు అనారోగ్యం వంటి వాటితో షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వస్తోంది. అయినా సరే ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

వాళ్లంతా వచ్చేశారు

వాళ్లంతా వచ్చేశారు

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఒలీవియా మోరిస్ అనే నటిని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఈమెను జెన్నీఫర్‌గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ట్విట్ చేసింది. అలాగే, ఈ సినిమాలో ప్రధాన విలన్ కూడా బ్రిటిష్ అధికారే ఉంటారు. అందుకని, విలన్‌గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను తీసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్ర లేడీ స్కాట్. ఇది కూడా విలన్ పాత్రే. ఈ పాత్రలో ప్రముఖ ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు.

రామ్ చరణ్ కూడా ఎంటర్

రామ్ చరణ్ కూడా ఎంటర్

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి' కోసం కొద్ది రోజుల పాటు ‘RRR' షూటింగ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ లోపు జూనియర్ ఎన్టీఆర్ సహా మిగిలిన నటీనటులపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధం అయిపోయాడు. ఈ మేరకు అతడు త్వరలోనే మేకప్ వేసుకోనున్నాడు.

రొమాంటిక్ సాంగ్‌తో మొదలు

రొమాంటిక్ సాంగ్‌తో మొదలు

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు రామ్ చరణ్. ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. తాజాగా ఈ జోడీకి సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇద్దరిపై రాజమౌళి ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ ప్రత్యేక సెట్‌ వేశారని సమాచారం. కొద్ది రోజుల్లోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.

Recommended Video

Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
‘RRR' గురించి

‘RRR' గురించి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X