Bhola Shankar మూవీలో స్టార్ హీరో కొడుకు.. ఏకంగా చిరంజీవితో కలిసి రచ్చ

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీలో మంచి జోష్ మీద కనిపిస్తోన్న ఆయన.. ఏకధాటిగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్నారు. దీనికితోడు గత సంక్రాంతికి ఈ స్టార్ హీరో 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి భారీ స్పందన దక్కడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆయనలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. అలా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులను చేస్తోన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' మూవీని చేస్తోన్నారు. దీన్ని మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ స్విడ్జర్లాండ్‌లో కొన్ని పాటలను షూట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీని నుంచి ఓ క్రేజీ నుంచి లీకైంది.

Bhola Shankar

ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో సుశాంత్ కీలక పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నాడట. అతడే.. సీనియర్ హీరో శ్రీకాంత్ మేక కుమారుడు రోషన్. పెళ్లి సందD చిత్రంతో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న అతడు.. 'భోళా శంకర్' మూవీలో ఓ గెస్టు రోల్‌ను చేస్తున్నాడట. అంతేకాదు, చిరంజీవితో కలిసి ఓ పాటలో స్టెప్పులు కూడా వేయబోతున్నాడని తెలిసింది. ఇక, రోషన్ వచ్చిన సీన్స్ అన్నీ ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

Bhola Shankar

'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా, అతడి చెల్లిగా కీర్తి సురేష్ చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఆగస్టులో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X