twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత సీనుందా...హిందీ వాళ్లు కొనేసారా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో హిట్...ఫ్లాప్ లకు సంభంధం లేకుండా సినిమా రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ వారు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నారా రోహిత్ తాజా చిత్రం రౌడి ఫెలో సైతం ఓ పెద్ద బాలీవుడ్ సంస్ధ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో దాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు మీడియాలో గుప్పుమంది. ఈ నేపధ్యంలో అసలు తెలుగులో ఫ్లాఫ్ సినిమా సినిమాని హిందీ వాళ్లు కొని రీమేక్ చెయ్యటమేంటనే చర్చ మొదలైంది. అయితే చిత్రంలో సెంట్రల్ పాయింట్ ని తీసుకుని దానికి ఫన్ ని యాడ్ చేసి భారీగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇక ఫ్లాఫ్ సినిమాలు సైతం తమకు ఇలాంటి బాలీవుడ్ ఆఫర్ ఏమన్నా తగులుతుందేమో అని ఎదురుచూడచ్చు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    చిత్రం కథేమిటంటే....డబ్బుతో పాటు బోలెడంత ఇగో ఉన్న కుర్రాడు రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్). అతని ఈగోని ఎవరన్నా హర్ట్ చేస్తే వారిని తిరిగి దెబ్బకొట్టేడానికి ఎంతదూరం అయినా వెళ్లే రకం. అమెరికానుంచి వచ్చిన రానా కి...ఓ రోజు అనుకోని పరిస్దితిలో ఓ పోలీస్ ఆఫీసర్ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో గొడవపడి ఇగో దెబ్బతింటుంది. దాంతో పోలీస్,పొలిటికల్ పవర్ తో తనను దెబ్బ కొట్టాడని అదే డిపార్టమెంట్ లో చేరి, తిరిగి అతనికి బుద్ది చెప్దామనుకుంటాడు.

    అందులో భాగంగా ఏలూరు దగ్గరలోని కొల్లేరులో ఉద్యోగం వేయించుకుంటాడు. అయితే అక్కడకి వెళ్లే సరికి సీన్ వేరే రకంగా ఉంటుంది. కొల్లేరు ప్రాంతాన్ని అక్కడ ఎంపి దుర్గా ప్రసాద్(రావు రమేష్) ఏలుతూంటాడు. ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు,అక్కడ జరిగుతున్న అరాచకాలు, జర్నలిస్ట్ మిస్సింగ్ వంటివి చూసిన రానా ఏం చేసాడు... అతను ప్రేమలో పడిన మేఘ(విశాఖ సింగ్) ఎవరు... అతని ఇగో తృప్తి పొందిందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    నిర్మాత టి. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.

    విశాఖా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సినిమా5, మూవీ మిరాకిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.

    English summary
    ‘Rowdy Fellow’ directed by Krishna Chaitanya, the story writer turned director, with Nara Rohit as hero, earned as a flop movie in Telugu . Rohit Shetty, who is known for remaking South films in Bollywood are knocking the doors of the producer to give them the remake rights .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X