ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి 'ఊసరవెల్లి' దెబ్బ
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి చిత్రాన్ని ఫ్యాన్సి రేటు ఇచ్చి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొన్న నాగచైతన్య దడ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న ఈ సంస్ధ ఈ చిత్రంతో కూడా అనుకున్న మొత్తాలు రావని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.దానికి కారణం రోజురోజుకీ కనపడుతున్న కలెక్షన్స్స డ్రాప్ అని చెప్తున్నారు. మొదట రోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆ తర్వాత వర్కవుట్ కాని సినిమాగా తేలింది. దాంతో తాము పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టుకోవాలని ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక నిర్మాత మెల్లిగా పబ్లిసిటీని కూడా తగ్గించారు.
ఈ వారం అంతా ఎన్టీఆర్ టీవీల్లో, పేపర్లలో కనపడి ఈ సినిమా గురించి ఊదరకొట్టినా పెద్దగా ఫలితం కనపడకపోవటం కూడా ఆర్ .ఆర్ వారిని నిరాసలో పడేసింది.ఇక నుంచి సినిమా తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలని నిర్ణయించుకన్నారని చెప్పుకుంటున్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ ఎఫెక్ట్ కూడా ఊసరవెల్లి మీద పడటం కూడా మైనస్ గా మారింది.ఇక ఆర్.ఆర్ మూవీ మేకర్స్ ప్రస్తుతం మహేష్ బాబుతో ది బిజెనెస్ మ్యాన్,సునీల్ తో పూల రంగడు,నాగచైతన్య తో ఆటో నగర్ సూర్య చిత్రాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











