RRR గ్లింప్స్‌లో ఎవరు ఊహించని లీక్... పులితోనే ఎన్టీఆర్ స్నేహం.. గూస్ బంప్స్ వచ్చేలా...

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా RRR సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. బాహుబలి సినిమా కంటే RRR సినిమా అంతకుమించి అనేలా విజయాన్ని అందుకుంటుంది అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు విడుదల చేసిన గ్లింప్స్‌ సినిమాపై ఒక్కసారి అంచనాల స్థాయిని పెంచేసింది. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కరెక్ట్ టైంలో సినిమా మరింత ఆశలను రేపుతోంది. ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం హాట్ టాపిక్ గా మారింది.

స్టార్ ఇమేజ్ ను సమానంగా..

స్టార్ ఇమేజ్ ను సమానంగా..

RRR సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు. రెండు పాత్రలు కూడా బిగ్ స్క్రీన్ పై సమానంగా కనిపించేలా దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విడుదలైన అన్ని రకాల పోస్టర్లు కూడా సమానమైన న్యాయం చేస్తున్నట్లు అర్థమవుతోంది. కథ పరంగా కూడా ఇద్దరు హీరోల స్టార్ ఇమేజ్ ను సమానంగా చూపించనున్ననట్లు ఇది వరకే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

 భారీ స్థాయిలో బిజినెస్

భారీ స్థాయిలో బిజినెస్

సాధారణంగా దర్శకుడు రాజమౌళి ఒక హీరో ఉంటేనే చాలా పవర్ఫుల్ గా చూపిస్తాడు. ఇక ఇద్దరు హీరోలు ఉన్నారు అంటే తప్పకుండా సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయో నేడు విడుదల చేసిన టీజర్ తోనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఈజీగా ఈ సినిమా బాక్సాఫీస్ మార్కెట్ లో చాలా వేగంగా వెయ్యి కోట్లను దాటి వెళుతుందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే మార్కెట్లోకి రాబోతోంది.

పులితో కొమరం భీమ్ స్నేహం

పులితో కొమరం భీమ్ స్నేహం

ఒక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ వేటాడే భయంకరమైన అడవి పులితో పోరాటానికి సిద్ధమవుతాడు. టీజర్ ఫస్ట్ షాట్ లోనే పులి వస్తున్నట్లుగా కొన్ని సీన్స్ చూపించారు. ఇక మధ్యలో పులి ఏకంగా బ్రిటిష్ వారిపై దాడికి దిగుతున్నట్లు అర్థమవుతుంది అంటే కొమురం భీం ఆ పులిని స్నేహంగా మార్చుకున్నాడా అనే అనుమానంగా మారింది.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
 ఈ లీక్ నిజమేనా?

ఈ లీక్ నిజమేనా?

యాక్షన్ సన్నివేశాల్లో పులి తో పాటు మరికొన్ని అడవి జంతువులు కూడా కనిపిస్తున్నాయి. కొమురం భీం పక్కా ప్రణాళికలతో వాటిని ఉసిగొలిపాడా లేక వారిపై దాడులు చేసే విధంగా దారి మళ్లించాడా అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం పులితో కొమురం భీమ్ స్నేహం గా ఉంటాడు అనే మీమ్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ స్టోరీ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా ఎదురు చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X