For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRRలో మగధీరను మించిపోయేలా భారీ యాక్షన్ సీన్.. ఆ హీరో కోసం ప్రత్యేకంగా..

  |

  దర్శక ధీరుడు రాజమౌళి అనగానే అందరికీ భారీ యుద్ధ సన్నివేశాలే గుర్తుకొస్తాయి. యాక్షన్ సినిమాల్లో సరైన ఎమోషన్ ని పండించగలిగే అగ్ర దర్శకుల్లో రాజమౌళి టాప్ లో ఉంటాడనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో యాక్షన్ సన్నివేశాలు పవర్ ఫుల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పర్ఫెక్ట్ గా వచ్చే వరకు కూడా అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వరని ఇండస్ట్రీలో అందరికి తెలుసు.

  మనసులో ప్రతి సన్నివేశాన్ని ముందే ఊహించుకునే జక్కన్న సీన్ ఆలోచనకు తగ్గట్టుగా వచ్చే వరకు కూడా విశ్రాంతి కూడా తీసుకొడు. నటీనటులకు రాజమౌళితో వర్క్ చేస్తే అదొక పెద్ద చాలెంజ్ అని చెప్పాలి. ఇక RRR సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

  Esther Anil : పరువాల ఆరబోతతో రెచ్చిపోయిన వెంకటేష్ చిన్న కూతురు... వామ్మో నెవర్ బిఫోర్ అంతే!

  అంతకుమించి అనేలా..

  అంతకుమించి అనేలా..

  ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో ద్వారా ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. తప్పకుండా యాక్షన్ సన్నివేశాలు అంతకుమించి అనేలా ఉంటాయని చెప్పవచ్చు.
  ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి షూటింగ్ పనులను అయితే ఇటీవల పూర్తి చేసుకున్నారు.

  ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

  100 మందిని చంపేసే సీన్

  100 మందిని చంపేసే సీన్

  ఇప్పటికే ఆ పాత్రలకు సంబంధించిన టీజర్స్ తో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అర్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో మగధీరను తలపించేలా ఒక భారీ ఫైట్ సీన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. మగధీర సినిమాలో 100 మందిని చంపేసే సీన్ ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి మేకింగ్ విజన్ ఏమిటో ఆ సినిమాతోనే అందరికీ అర్థమైపోయింది.

  అల్లూరి కోసం కొమురం భీమ్ పోరాటం

  అల్లూరి కోసం కొమురం భీమ్ పోరాటం

  బాహుబలిలో కూడా వేలాది మందితో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడంతో ఆయన స్థాయి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు RRR సినిమాలో కూడా హీరోలు అదేస్థాయిలో పోరాటాలు చేస్తారట. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కోసం వందమంది బ్రిటిషర్లతో ఒకేసారిగా పోరాడటానికి సిద్ధమవుతాడట. అల్లూరి సీతారామరాజు కోసం భీమ్ వారిని ఊచకోత కొస్తాడాని ఒక టాక్ అయితే వస్తోంది.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  బ్రిటిష్ రాజులు పంపిన సైనికులు

  బ్రిటిష్ రాజులు పంపిన సైనికులు

  బ్రిటిష్ రాజులు పంపిన వంద మంది సైనికులను కొమరం భీమ్ ఒక్కడే ఎదుర్కొనే యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఇక సినిమాలో హీరోలు ఇద్దరు కొట్టుకునే సీన్ ఒక సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుందని ఇదివరకే చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు.

  ఇక ఇప్పుడు ఒకేసారి వంద మందినిని చంపే సన్నివేశం కూడా అంతకు మించి అనేలా మంచి కిక్ ఇస్తుందని టాక్ వస్తోంది. మరి సినిమా అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.వి.వి.దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  RRR biggest action scene between jr ntr and 100 villains..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X