RRR వాయిదా పక్కా.. కొత్త రిలీజ్ డేట్ బయటకొచ్చేసింది!

By Manoj Kumar P

'RRR'.. 'బాహుబలి' వంటి సంచలన సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడానికి తోడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన యాక్టర్లతో పాటు టెక్నీషియన్లు పని చేస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం షాక్‌కు గురి చేస్తోంది.

చాలా వరకు అయిపోయింది

చాలా వరకు అయిపోయింది

దాదాపు ఏడాది క్రితం RRR ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఇందులో నటిస్తున్న హీరోలు రామ్ చరణ్, తారక్ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, రాజమౌళి తన వ్యక్తిగత విషయాల కోసం విశ్రాంతి తీసుకోవడం, తర్వాత హీరోయిన్‌ ఆలియాకు అనారోగ్యం వంటి వాటితో షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వస్తోంది. అయినా సరే ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

వాళ్లు రావడంతో బ్యాలెన్స్ సరి

వాళ్లు రావడంతో బ్యాలెన్స్ సరి

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఒలీవియా మోరిస్ అనే నటిని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అలాగే, ఈ సినిమాలో విలన్‌గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను తీసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్ర లేడీ స్కాట్. ఈ పాత్రలో ప్రముఖ ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. వీళ్లతో పాటు చరణ్ కూడా షూటింగ్‌లో చేరడంతో మిగిలిన భాగం చిత్రీకరిస్తున్నారు.

పది భాషల్లో విడుదల.. ‘RRR' వాయిదా

పది భాషల్లో విడుదల.. ‘RRR' వాయిదా

ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘RRR' వాయిదా పడబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమా షూటింగ్‌కు వస్తున్న అవాంతరాలే. దీనికి తోడు, ఇటీవల హాలీవుడ్ నటులను తీసుకోవడంతో.. ఈ సినిమాను పది భాషల్లో విడుదల చేస్తారని ప్రచారం మొదలైంది. దీంతో సినిమా వాయిదా పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

కొత్త రిలీజ్ డేట్ బయటకొచ్చింది

కొత్త రిలీజ్ డేట్ బయటకొచ్చింది

‘RRR' వాయిదా పడడం ఖాయమన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చేసింది. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేస్తారట. ఇది వీకెండ్‌లో రావడానికి తోడు దసరా సెలవులు ప్రారంభం అవుతాయన్న కారణంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఇక, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' సినిమా కూడా అక్టోబర్ 2నే విడుదలైన విషయం తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Recommended Video

CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
‘RRR' గురించి

‘RRR' గురించి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X