RRR రిలీజ్ విషయంలో రాజమౌళి అదిరిపోయే స్ట్రాటజీ: షూటింగ్ పూర్తయినా అందుకే ఆలస్యం.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా పరిచయం అయ్యారు. వారిలో కొంత మంది మాత్రమే గొప్ప దర్శకులుగా ఖ్యాతి గడించారు. అలాంటి వారిలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. 'స్టూడెంట్ నెం 1' సినిమాతో దర్శకుడిగా ఎంటర్ అయిన ఆయన.. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వంద శాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకుడిగా పేరొందిన ఆయన.. ఇప్పుడు RRR అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో రాజమౌళి వేసిన ఓ ప్లాన్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

ఆయనతో పాటు తెలుగు సినిమా వెలిగింది

ఆయనతో పాటు తెలుగు సినిమా వెలిగింది

వరుస విజయాలతో దూసుకుపోతోన్న రాజమౌళి.. కొన్నేళ్ల క్రితం ‘బాహుబలి' అనే సినిమాను తెరకెక్కించాడు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రభంజణమే సృష్టించింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీంటిని బద్దలు కొట్టింది. దీంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.

మరో అస్త్రం సిద్ధం చేస్తున్న రాజమౌళి

మరో అస్త్రం సిద్ధం చేస్తున్న రాజమౌళి

‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ ఇందులో హీరోయిన్లు. ఈ మూవీలో తారక్.. కొమరం భీమ్‌గా, రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

వాళ్లను నిరాశ పరుస్తోన్న దర్శకధీరుడు

వాళ్లను నిరాశ పరుస్తోన్న దర్శకధీరుడు

RRR షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. దీనికితోడు ఈ మూవీని అనుకున్న దానికంటే ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క సర్‌ప్రైజ్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ అందరూ నిరాశకు లోనవుతున్నారు.

షూటింగ్ ఎప్పటికి పూర్తి అవుతుందంటే..

షూటింగ్ ఎప్పటికి పూర్తి అవుతుందంటే..

ఇప్పటికి డెబ్బై శాతం మాత్రమే షూటింగ్ పూర్తయినప్పటికీ... మిగిలిన దాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. మొత్తంగా ఆగస్టు చివరి కల్లా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టాలని టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారట. ఇక, అక్టోబర్ చివరి కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తారని సమాచారం. అప్పటి నుంచి విడుదల వరకు ప్రమోషన్ చేస్తారని టాక్.

ఆ విషయంలో రాజమౌళి అదిరిపోయే స్ట్రాటజీ

ఆ విషయంలో రాజమౌళి అదిరిపోయే స్ట్రాటజీ


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడా తేదీని జనవరి 8, 2021కి మార్చారు. తాజా సమాచారం ప్రకారం... భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమా కావడంతో లాంగ్ సీజన్ ఉండాలని రాజమౌళి భావించారట. అందుకే సంక్రాంతి పండును ఎంచుకున్నారని తెలిసింది.

Recommended Video

RRR First Look : The Best Fan Made Posters | RRR Poster Review | JR NTR | Ram Charan
తెలుగులో మరో సినిమా విడుదల కాదా.?

తెలుగులో మరో సినిమా విడుదల కాదా.?

సంక్రాంతి అంటేనే సినిమా ప్రియులకు పండుగ. దీనికి కారణం ఆ సీజన్‌లో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అయితే, వచ్చే ఏడాది మాత్రం అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. RRR విడుదల కాబోతుండడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని ప్రచారం జరుగుతోంది. పెద్ద సినిమా కావడంతో మిగిలిన వాళ్లు సాహసం చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X