ఆ బాధ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ను కలవబోతున్న రాజమౌళి.. ఇదే ఆఖరి ఛాన్స్?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం అంతకుమించి అనే తరహాలో సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి మరో లెవెల్ కు వెళుతుంది అని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఇక సంక్రాంతికి ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ముఖ్యమైన విషయం కోసం దర్శకుడు రాజమౌళి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా కలవబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మొదటికే మోసం వస్తుంది..

మొదటికే మోసం వస్తుంది..

RRR సినిమా బాక్స్ ఆఫీసు వద్ద వీలైనంత త్వరగా బ్రేక్ ఈవెన్ ను అందుకోక పోతే మొదటికే మోసం వస్తుంది. అంతేకాకుండా దాదాపు 450 కోట్ల పెట్టుబడితో రెండేళ్లకు పైగా కష్టపడ్డారు అంటే తప్పకుండా ఎంతో కొంత లాభం రావాల్సి ఉంటుంది.. లేకుంటే కష్టపడిన దానికి విలువ కూడా ఉండదు. దర్శకుడు రాజమౌళి ఎంతో నమ్మకం ఉంటే గాని ఆ స్థాయిలో ఖర్చు పెట్టించడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా RRR విషయంలో కూడా చిత్ర యూనిట్ తో పాటు పంపిణీదారులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు.

పాజిటివ్ వైబ్రేషన్స్

పాజిటివ్ వైబ్రేషన్స్

RRR సినిమాతప్పకుండా అంచనాలకు మించి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అలాగే పాటలు కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి

మెగా, నందమూరి కలయికలో రాబోతున్న మొదటి మల్టీస్టారర్ సినిమా కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారని సోషల్ మీడియాలో ఒక లుక్కేస్తే అర్థమవుతుంది.

పోటీ లేకుండా ఉండాలని

పోటీ లేకుండా ఉండాలని

అసలైతే ఈ ఏడాది దసరా సమయానికి విడుదల కావాల్సిన RRR కరోనా కారణంగా అలాగే ఆంధ్రప్రదేశ్లోని టికెట్ల రేట్లు ధరల కారణంగా వాయిదా పడింది. ఇక 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే దర్శకుడు రాజమౌళి RRR సినిమాను ఇతర సినిమాలతో పోటీ లేకుండా విడుదల చేయాలని ముందు నుంచి ఆలోచిస్తున్నాడు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మరో రెండు పెద్ద సినిమాల్లో పోటీకి వస్తున్నాయి.

రిస్క్ అనే చెప్పాలి

రిస్క్ అనే చెప్పాలి

సంక్రాంతి అనగానే మంచి సినిమాలకు కాసుల వర్షం కురిపిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక జనవరి 12న భీమ్లా నాయక్ తప్పకుండా రాబోతున్నట్లు అర్థం అయ్యింది. ఆ తర్వాత రాధేశ్యామ్ కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే RRR సినిమాకు ఈ పోటీ అనేది చాలా రిస్క్ అనే చెప్పాలి. రాధేశ్యామ్ సినిమాతో అయితే తెలుగులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మధ్యలో భీమ్లా నాయక్ కారణంగా పోటీ మాత్రం కాస్త తీవ్రంగానే ఉంటుంది. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి.

రంగంలోకి రాజమౌళి

రంగంలోకి రాజమౌళి

ఇప్పటికే కొన్ని సార్లు భీమ్లా నాయక్ నిర్మాతలను RRR యూనిట్ ప్రత్యేకంగా కలిసి ఈ సినిమాను వాయిదా వేసుకోవాలని కోరింది. కానీ ఆ విషయంలో నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక రాజమౌళి డైరెక్ట్ గా రంగం లోకి దిగిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలవబోతున్నట్లు సమాచారం. బిమ్లా నాయక్ సినిమా తర్వాత వచ్చిన కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా ఈజీ గా అందుకుంటుంది. కానీ RRR సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన రిస్క్ లో పడినట్లే. అందుకే బిమ్లా నాయక్ సినిమాను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని రాజమౌళి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Recommended Video

RRR గ్రాండ్ రిలీజ్.. Bheemla Nayak పై ఆఖరి అస్త్రం | Pawan Kalyan || Filmibeat Telugu
ఇదే ఆఖరి ఛాన్స్..

ఇదే ఆఖరి ఛాన్స్..

ఇప్పటికే భీమ్లా నాయక్ నిర్మాతలు సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో వాళ్ళు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని నిన్నటితో మరోసారి రుజువయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం పవర్ స్టార్ రానా దగ్గుబాటిలతో పోటీ లేకుండా ఉండాలని అనుకుంటుంది. ఇక ఆఖరి సారిగా ఎస్ఎస్ రాజమౌళి రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంది.

ఇక చర్చలు సక్సెస్ అయితే భీమ్లా నాయక్ వాయిదా పడవచ్చు లేదా ఎప్పటిలానే బాక్సాఫీసు వద్ద ఒక బిగ్ ఫైట్ చూసే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు నిర్మాత డివివి దానయ్య, మరికొందరు బయ్యర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కూడా కలిసే అవకాశం ఉందట. మరి ఈ చర్చలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. అయితే ఎవరు ఉన్నా లేకపోయినా మాత్రం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా మాత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X