For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRRలో 10 రకాల హై వోల్టేజ్ ఫైట్స్.. రోమాలు నిక్కబొడిచేలా..

  |

  టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో రికార్డులను బ్లాస్ట్ చేయబోతున్న RRR సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం సౌత్ అభిమానులు మాత్రమే కాకుండా కూడా సినిమాపై నార్త్ ఆడియెన్స్ కూడా భారీ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. బాహుబలి సినిమా తో డైరెక్టర్ రాజమౌళి స్థాయి నార్త్ లో అయితే అమాంతంగా పెరిగిపోయింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు హిందీ మార్కెట్లోకి వెళ్ళింది లేదు. రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో జంజీర్ రీమేక్ తో కాస్త అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

  ఇక ఇద్దరి హీరోల డబ్బింగ్ సినిమాలు మాత్రం నార్త్ ఆడియన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. రెండు పాత్రలకు సమన్యాయం చేసే విధంగానే దర్శకుడు రన్ టైమ్ ను కరెక్ట్ గా సెట్ చేసుకున్నాడట. ఒకరు తక్కువ కాకుండా మరొకరు ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ తో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ విషయం పై ఇదివరకే రచయిత కె.విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చాడు. మెగా నందమూరి అభిమానులను సంతృప్తి చెందే విధంగానే ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు.

  RRR high voltage fights and interesting scenes in every 10 minutes gap

  ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం దర్శకుడు రాజమౌళి యాక్షన్ సీక్వెన్స్ కోసం సమయాన్ని కేటాయించినట్లు సమాచారం. కథలో హేవి ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా కరెక్ట్ టైంలో ఉంటాయట. పది నిమిషాలకు ఒకసారి ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడిచేలా సన్నివేశాలు దర్శనమిస్తాయని తెలుస్తోంది. దాదాపు 10 రకాల డిఫరెంట్ హై వోల్టేజ్ ఫైట్ సీన్స్ ఈ సినిమాలో కంపోజ్ చేశారట. ఎక్కువ భాగం యాక్షన్ సీన్స్ కోసం ఖర్చు చేసినట్లు అర్థమవుతోంది. రాజమౌళి ప్రతి సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతి ఎపిసోడ్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెప్పవచ్చు.

  సాదారణ పాత్రలతోనే ఒక రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేయగలిగే జక్కన్న ఈసారి ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ ఆధారంగా చేసుకొని సినిమా చేస్తున్నాడు కాబట్టి యాక్షన్ డోస్ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఇక సినిమా విడుదల తేదీపై మళ్లీ కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో అయితే టికెట్ల విషయంలో క్లారిటీ వచ్చేలా లేదని తెలుస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాల కలెక్షన్స్ కూడా అంతగా సంతృప్తినివ్వలేదు. దీంతో చాలా సినిమాలో ఓటీటీ ఆఫర్స్ కు తలొగ్గక తప్పడంలేదు. చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక RRRను మాత్రం తప్పకుండా థియేటర్స్ లోనే విడుదల అవుతుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని పోస్టర్స్ ద్వారా క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ పరిస్థితిలు ఇప్పటివరకు అనుకూలించక పోతే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి తీసుకురావచ్చని తెలుస్తోంది.

  English summary
  RRR high voltage fights and interesting scenes in every 10 minutes gap
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X