Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
RRR సర్ప్రైజ్.. జక్కన్న స్పెషల్ ట్రీట్.. ఇక మెగా, నందమూరి అభిమానులకు పండగే పండగ
మెగా, నందమూరి అభిమానులకు ఏక కాలంలో స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమాలో మెగా, నందమూరి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. తాజాగా ఇందుకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ తెలిసింది. వివరాల్లోకి పోతే..
డాన్సుల్లో ఎవరికి వారే సాటి
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ డాన్సుల్లో ఎవరికీ వారే సాటి. స్పీడ్ డాన్స్ చేస్తూ థియేటర్లలో ఆడియన్స్ చేత కేకలు పెట్టించడం ఈ ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే వీళ్ళ సినిమాల్లో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా వెళ్తున్నారనేది తాజా సమాచారం.
మిస్ అవుతామేమో అనుకున్నారు.. కానీ
RRR సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయా అనే ఆసక్తి అభిమానుల్లో ఉన్న సంగతి తెలిసిందే. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు మిస్ అవుతామేమో అని భావించారు వారి వారి ఫ్యాన్స్. కానీ మెగా, నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా ఏడు పాటలు, హోరెత్తిపోయే డాన్సులు రూపొందిస్తున్నారట జక్కన్న.
ఇదీ లెక్క.. మునుపెన్నడూ చూడని విధంగా
అందులో దేశభక్తికి సంబంధించి రెండు పాటలు, అలాగే రామ్ చరణ్- ఆలియా భట్ పై రెండు పాటలు, ఎన్టీఆర్తో మరో రెండు రొమాంటిక్ సాంగ్స్, అలాగే ఒక ఫోక్ సాంగ్ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారట. ఈ ఏడు పాటల్లో సుద్దాల అశోక్ తేజ 3 పాటలను రాశారని తెలుస్తోంది. థియేటర్లు హోరెత్తిపోయేలా భారీ హంగులతో ఈ పాటల్లో హీరోలు చేసే డాన్సులు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తోంది.
రాజమౌళి స్కెచ్.. మెగా, నందమూరి అభిమానులకు కిక్
ఇక ఈ పాటలకు కీరవాణి సమకూర్చుతున్న సంగీతం ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్ధులను చేస్తుందని అంటున్నారు. RRR లోని సన్నివేశాల విషయంలో ఎంత శ్రద్ద పెడుతున్నారో.. పాటల విషయంలోనూ అంతే శ్రద్ద తీసుకుంటున్నారట జక్కన్న. సో.. ఈ రకంగా మెగా, నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా రాజమౌళి స్కెచ్ వేశారని సమాచారం.
RRR మూవీ.. ఆలియా భట్, అజయ్ దేవగణ్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30 వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.