RRR Interval Scene Leaked: మొసలితో యాక్షన్ సీన్.. ఆడియెన్స్ ఫ్యూజులు ఔట్ కావడం గ్యారెంటీ!
మెగా నందమూరి హీరోలకు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా లో ప్రతి 15 నిమిషాలకు ఒక ఊహించని ట్విస్ట్ కూడా ఉంటుంది అని ఇదివరకే చెప్పారు. అయితే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అలాగే ఇంటర్వెల్ సీన్ రోమాలు ఫ్యూజులు అవుట్ అయ్యేలా అద్భుతంగా ఉంటాయట. ముఖ్యంగా నీళ్ళల్లో బలంగా ఉండే మొసలితో కూడా వాళ్ళు ఫైట్ చేస్తారట. ఇక ఆ సీన్స్ ఎలా ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి అనే వివరాల్లోకి వెళితే..

పవర్ఫుల్ హీరోస్
దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చిన కూడా అందులో యాక్షన్ సీన్స్ కోసమే భారీగా ఆలోచిస్తాడు అని అర్థమవుతుంది. హీరో ఎవరైనా సరే చాలా పవర్ఫుల్ గా చూపిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రాజమౌళి సాధారణంగా హీరోలను ఒక లెవెల్లో చూపిస్తాడు అంటే ఇక నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లను ఎలా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కీరవాణి స్పెషల్ వర్క్
తప్పకుండా సినిమాలో ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుంది అని ఇదివరకే విడుదలైన ట్రైలర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించిన పాటలు అన్నీ కూడా ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచాయి. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది అని తెలుస్తోంది.

రన్ టైమ్.. ఎంతంటే
అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఈ సినిమా మూడు గంటల 9 నిమిషాల నిడివితో రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. మూడు గంటలు అంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. కాని దర్శకుడు 9 నిమిషాలు కూడా జోడించడం విశేషం. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇంటర్వెల్ సీన్.. ఆటమ్ బాంబ్
రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్లాక్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా లో కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు బ్రిడ్జి మీద కలిసి పోరాడే సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు జాతీయ జెండాను పట్టుకుని బ్రిడ్జి కింద అలా గాలిలో తేలుతూ చేతులు పట్టుకోవడం ట్రైలర్ లో కూడా హైలెట్ అయిన విషయం తెలిసిందే. అదే ఇంటర్వల్ బ్లాక్ అని తెలుస్తోంది. అదొక ఆటమ్ బాంబ్ అని కూడా అంటున్నారు.
Recommended Video


మొసలితో హై వోల్టేజ్ ఫైట్
ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నీళ్ళల్లో పడినప్పుడు మొసలి నుంచి కూడా ఒక భారీ ప్రమాదాన్ని ఎదుర్కొంటారట. ట్రైలర్ లో కూడా ఇద్దరు హీరోలను నీళ్ళల్లో నడుచు కుంటూ వచ్చే ఒక షాట్ ను అద్భుతంగా చూపించారు. అయితే అప్పుడే వారు ఒక మొసలి తో కూడా పోరాడతారట. సముద్రంలో చాలా బలంగా ఉండే మొసలితో తో పోరాడటం ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఎవరు ఊహలకు అందడం లేదు. ఇక రాజమౌళి ఇది వరకే చత్రపతి సినిమాలో ప్రభాస్ తో ఒక భారీ సొరచేప తో ఒక పవర్ ఫుల్ ఎపిసోడ్ ను చూపించాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కాబట్టి వారితో ఎలా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











