RRR అప్‌డేట్: షాకింగ్ బడ్జెట్.. ఆ ఒక్క పోర్షన్ కోసమే! రాజమౌళి న్యూ స్కెచ్
'బాహుబలి' తర్వాత RRR రూపంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దర్శకధీరుడు రాజమౌళి. పైగా ఈ సినిమా కోసం ఇద్దరు టాప్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను రంగంలోకి దించారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపైనే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో RRRకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

రాజమౌళి స్పెషల్ ఫోకస్.. శరవేగంగా షూటింగ్
టాలీవుడ్ ఘనత, తోలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న RRR సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై రాజమౌళి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూ భారీ హంగులు జోడిస్తున్నారు.

డీవీవీ దానయ్య సపోర్ట్.. రాజమౌళి స్కెచ్
దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న `RRR` మూవీకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా రాజమౌళికి ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈ మేరకు క్లైమాక్స్ కోసమై రాజమౌళి న్యూ స్కెచ్ వేశారట. భారీ రేంజ్‌లో క్లైమాక్స్ సీన్స్ ఉండేలా చేసుకుంటున్నారట.

రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు
కేవలం క్లైమాక్స్ కోసమే 150 కోట్లు కేటాయిస్తున్నారట. భారీ యాక్షన్ క్లైమాక్స్‌ను రాజమౌళి ప్లాన్ చేశారట. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో నందమూరి, మెగా అభిమానులను అబ్బురపరిచే సీన్స్ రూపొందించనున్నారట జక్కన్న. దాదాపు 15 నిమిషాల పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉండనున్నాయట.

ఎన్టీఆర్, రామ్ చరణ్
RRR సినిమాలో తెలంగాణ విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. అజయ్ దేవగణ్, సముద్రఖని, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Recommended Video

80 శాతం కంప్లీట్.. ముహూర్తం అప్పుడే
అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాలు నడుమ జులై 30న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











