»   » రాజమౌళి ప్లాన్స్ మామూలుగా లేవుగా... ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టులోకి కరణ్ జోహార్?

రాజమౌళి ప్లాన్స్ మామూలుగా లేవుగా... ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టులోకి కరణ్ జోహార్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Rajamouli Plans For RRR Movie Promotion Plan

    బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత దర్శకుడు రాజమౌళి నుండి మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకులు పెద్ద సినిమాను ఆశించడం సహజమే. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎవరూ ఊహించిన రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేయడమే కాదు... తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుగా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

    రాజమౌళి ప్లానింగ్ మామూలుగా ఉండదుగా...

    రాజమౌళి ప్లానింగ్ మామూలుగా ఉండదుగా...

    రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్లానింగ్ భారీగా ఉంటుంది. తను తీయబోయే సినిమా బడ్జెట్‌కు తగిన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటారు. అలా పర్ఫెక్టుగా ప్లానింగ్ చేశారు కాబట్టే బాహుబలి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘ఆర్ఆర్ఆర్' విషయంలోనూ రాజమౌళి అలాంటి ప్లానింగే చేస్తున్నారట.

     ‘ఆర్ఆర్ఆర్‌’లోకి కరణ్ జోహార్

    ‘ఆర్ఆర్ఆర్‌’లోకి కరణ్ జోహార్

    రూ. 300 కోట్ల బడ్జెట్ సినిమా అంటే కేవలం తెలుగు, తమిళంలో అయితే వర్కౌట్ కాదు. ఇండియాలో ఎక్కువ మార్కెట్ హిందీ సినిమాలకే ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అక్కడ మార్కెటింగ్ చేసేందుకు కరణ్ జోహార్‌ను రంగంలోకి దింపబోతున్నారట.

     బాహుబలి సక్సెస్ వెనక కరణ్ జోహార్ బ్రాండింగ్

    బాహుబలి సక్సెస్ వెనక కరణ్ జోహార్ బ్రాండింగ్

    బాహుబలి ప్రాజెక్ట్ హిందీలో అంత పెద్ద విజయం సాధించిందంటే కారణం దాని వెనక కరణ్ జోహార్ బ్రాండింగ్ ఉందని చెప్పక తప్పదు. బాలీవుడ్లో ప్రముఖ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ బాలీవుడ్లో బాహుబలిని ప్రమోట్ చేయడం వల్లనే హిందీ ప్రేక్షకులు థియేటర్ల వరకు వచ్చారు. సినిమా కూడా అద్భుతంగా ఉండటంతో పెద్ద విజయం సాధించింది. అలా బాహుబలి సినిమాలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కేవలం తన ‘ధర్మా ప్రొడక్షన్స్' బేనర్లో విడుదల చేయడం ద్వారా భారీ లాభాలు పొందారు.

    ప్లానింగ్ అంతా రాజమౌళి టీమ్

    ప్లానింగ్ అంతా రాజమౌళి టీమ్

    ‘ఆర్ఆర్ఆర్' మూవీకి నిర్మాత డివివి దానయ్యే అయినప్పటికీ సినిమా తెరకెక్కించడం దగ్గర నుండి నటీనటుల ఎంపిక, మార్కెటింగ్ వ్యవహారాలన్నీ రాజమౌళి అండ్ టీమ్ చూసుకుంటున్నారట. రాజమౌళి నిర్ణయం మేరకే కరణ్ జోహార్‌తో బాలీవుడ్లో ‘ఆర్ఆర్ఆర్' మూవీ విడుదల చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

    నవంబర్ నుండి ప్రారంభం

    నవంబర్ నుండి ప్రారంభం

    ‘ఆర్ఆర్ఆర్' చిత్రం నవంబర్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయకు రాలేదు. సినిమా లాచింగ్ సమయంలోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Film Nagar source said that, Bollywood film maker Karan Johar came forward to clinch the deal with Rajamouli for his next movie that stars NTR and Ram Charan. The multi-lingual entertainer will commence regular shoot in November this year. The film is being produced by DVV Danayya but it is Rajamouli and his team that is handling entire production and business matters.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more