RRR నుంచి మరో లీక్: ట్రైన్‌లో ఎన్టీఆర్ అదిరిపోయే ఫీట్స్.. సినిమాకే హైలైట్‌‌గా నిలిచే సీన్ ఇదే.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో త్వరలో రాబోతున్న RRR ఒకటి. దీనికి కారణం.. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే. అంతేకాదు, ఈ సినిమాను దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తుండడంతో దీనిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో RRRలోని ఓ సన్నివేశం లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

ఆ ఇద్దరు హీరోల కోసం ఈ ఇద్దరు హీరోలు కలిశారు

ఆ ఇద్దరు హీరోల కోసం ఈ ఇద్దరు హీరోలు కలిశారు

‘బాహుబలి' తర్వాత దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో వీళ్లిద్దరూ కొమరం భీం, అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇద్దరు రియల్ హీరోల కోసం మెగా, నందమూరి హీరో కలిసి పని చేస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

చాలా బ్యాలెన్స్ ఉంది.. అందుకే దూరం జరిపేశారు

చాలా బ్యాలెన్స్ ఉంది.. అందుకే దూరం జరిపేశారు

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. అయినప్పటికీ మూవీ షూటింగ్ మాత్రం డెబ్బై శాతం వరకు మాత్రమే పూర్తయిందని తెలుస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. మిగిలిన భాగంలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండడం వల్లే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది.

అలా డిసైడ్ అయిన జక్కన్న.. చెక్కుతున్నాడుగా

అలా డిసైడ్ అయిన జక్కన్న.. చెక్కుతున్నాడుగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను కూడా ఆయా భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన సమయం తీసుకుని మరీ అన్ని భాషల్లో షూటింగ్ జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

RRR యూనిట్‌కు సరికొత్త కష్టం.. మరో ఆటంకం

RRR యూనిట్‌కు సరికొత్త కష్టం.. మరో ఆటంకం

RRR షూటింగ్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ, ఈ సినిమా షూటింగ్‌కు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే నటీనటులు గాయపడడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం సహా కొన్ని కారణాల వల్ల షూటింగ్‌కు పలుమార్లు ఆటంకం ఏర్పడింది. ఇక, తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది.

RRRకు తప్పని లీకుల బెడద.. ఇప్పుడు మరోటి

RRRకు తప్పని లీకుల బెడద.. ఇప్పుడు మరోటి

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో RRR గురించి ఏ వార్త వచ్చినా హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే దీని గురించి ఎన్నో అంశాలు లీక్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా RRR నుంచి మరో న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించినది కావడం విశేషం.

Recommended Video

NTR & Ram Charan Important Message to Fans | Filmibeat Telugu
ఎన్టీఆర్ ఫీట్స్.. సినిమాకే హైలైట్‌‌గా నిలిచే సీన్ ఇదే.!

ఎన్టీఆర్ ఫీట్స్.. సినిమాకే హైలైట్‌‌గా నిలిచే సీన్ ఇదే.!

తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నిజాం దొరలు ట్రైన్లో తరలిస్తున్న బాంబులు, ఆయుధాలను దొంగిలిస్తాడట. ఈ సీన్ కోసం అతడు చేసే ఫీట్లు ఆకట్లుకుంటాయని, నందమూరి అభిమానులకు మాత్రం పండుగలా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఈ సీన్ సినిమాలోని హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందని తాజాగా ఓ న్యూస్ ప్రచారం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X