RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!

By Manoj Kumar P

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కితాబందుకుంటున్నాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. 'బాహుబలి' రెండు భాగాలతో ఆయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. అదే సమయంలో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఈ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'.

ఇందులో ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది.? ఎందుకు వాళ్లు సంతోష పడుతున్నారు..?

అసలు అందులో ఏముందంటే..

అసలు అందులో ఏముందంటే..

టాలీవుడ్‌లోనే బడా హీరోలుగా పేరొందిన తారక్, చరణ్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR'. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

RRR నుంచి ఇది ఊహించి ఉండరు

RRR నుంచి ఇది ఊహించి ఉండరు

RRR మూవీ షూటింగ్ ప్రారంభమై ఏడాది గడిపోయింది. అయినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని ఇటీవల యూనిట్ ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్‌కు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అలాగే నటులకు గాయలవడంతో పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. అయినా.. రాజమౌళి టీమ్ బాగానే కవర్ చేసింది.

వాళ్లు రావడంతో ఊపొచ్చేసింది

వాళ్లు రావడంతో ఊపొచ్చేసింది

ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నా.. చాలా మంది నటులను ఎంపిక చేయలేదు. అందులో ముఖ్యంగా తారక్ సరసన చేసే హీరోయిన్ ఎంపికపై క్లారిటీ రాలేదు. కానీ, ఇటీవల ఆమెతో పాటు మరో ఇద్దరు విలన్లను పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ హీరోయిన్‌గా ఒలీవియా మోరిస్, విలన్లుగా రే స్టీవెన్‌సన్‌, అలిసన్ డూడీని ఎంపిక చేశారు. వీళ్లంతా విదేశీయులే.

వాయిదా వేస్తున్నారు

వాయిదా వేస్తున్నారు

ఇక, ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగా జూలై 30, 2020న విడుదల చేయడం లేదని ఇటీవల ఓ వార్త హల్‌చల్ చేసింది. దీనికి బదులు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అన్నారు. దీనికి కారణం ఈ సినిమాను పది భాషల్లో విడుదల చేయాలనుకోవడమేనని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

షాక్‌కు గురి చేస్తున్న లీక్స్

షాక్‌కు గురి చేస్తున్న లీక్స్

రాజమౌళి సినిమా అంటే షూటింగ్ స్పాట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో ‘బాహుబలి' సినిమా లీక్ అవడం వల్ల ఇలా చేస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇందులో తారక్.. కొమరం భీం గెటప్‌లో కనిపిస్తున్నాడు. దీంతో యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని టాక్.

వాళ్లు మాత్రం తెగ సంబరపడుతున్నారు

వాళ్లు మాత్రం తెగ సంబరపడుతున్నారు

RRR నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్ లీక్ అవడంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట. దీనికి కారణం ఆ వీడియో బయటకు వచ్చినందుకు కాదని అంటున్నారు. గతంలో ఇలా లీక్ అయిన ‘బాహుబలి', ‘అత్తారింటికి దారేది' సహా పలు సినిమాలు ఘన విజయం సాధించాయి. సో.. ఇది కూడా హిట్ అవుతుందని వాళ్లు సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X