RRR మేకర్స్ సంచలన నిర్ణయం.. మొండితనానికి పోకుండా అలా.. సంక్రాంతి బరిలోకి మెగాస్టార్?
దర్శకధీరుడు రాజమౌళి రౌద్రం రౌద్రం పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా ముహూర్త బలం బాగాలేదు ఏమో తెలియదు కానీ ఈ సినిమా మొదలుపెట్టిన నాటి నుంచి ఏదో ఒక విధంగా వెనక్కి వెళుతూ ఉంది. అనేక బాలారిష్టాలు ఎదుర్కొని చివరికి విడుదల కావడం కోసం సిద్ధమవుతున్న ఈ సినిమా మరో అయిదు రోజుల్లోనే విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

కొన్ని రోజులకే ప్రకటన
బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రాజమౌళి ఆ తర్వాత నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా రౌద్రం రణం రుధిరం అనే సినిమాను తెరకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. చరిత్రలో కలవని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుంది అనే సినిమా రూపొందిస్తున్నట్లు సినిమా ప్రకటించిన కొన్ని రోజులకే ఒక ప్రకటన విడుదల చేశారు.

కరోనా ఎంటర్ కావడంతో
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో 2018 వ సంవత్సరంలో మొదలు పెట్టారు కానీ ఆ తర్వాత ఏడాదికే దేశంలో కరోనా ఎంటర్ కావడంతో షూటింగ్ బాగా నెమ్మదిస్తూ వచ్చింది. ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్ లాంటి కీలక నటీనటులు నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తూ ఉండగా రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఇక అనేక వాయిదాల తర్వాత ఈ సినిమాని జనవరి ఏడవ తారీఖున థియేటర్లలో విడుదల చేయాలి అని భావిస్తూ రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు.

ప్రమోషనల్ ఈవెంట్స్
రాజమౌళి తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే దాదాపు దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో ఈ సినిమా యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. స్వయంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, అలియా భట్ నలుగురూ కలిసి వెళ్లి ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ అక్కడి ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో
అలాంటిది ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సినిమా వాయిదా వేయడం తప్పదు అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ, పలు ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

‘RRR' విడుదల వాయిదా
టెన్షన్ తీసుకోకుండా 'RRR' విడుదలను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారని, వాయిదాపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు 'RRR'ను పరిస్థితి కొంచెం కుదుట పడ్డాక 2022 వేసవిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ RRR కనుక వెనక్కు తగ్గితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఆచార్య రంగంలోకి దిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే ఏదేమైనా ఏం జరగనుందనేది మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











