RRRకి కొత్త కలవరం.. భయపెడుతున్న రెండు విషయాలు.. ఆ అడ్డంకులు తప్పవా?

RRR సినిమాను రాజమౌళి ఏ క్షణాన మొదలు పెట్టారో తెలియదు కానీ అప్పటి నుంచి సినిమా విడుదల కోసం కష్టపడుతూనే ఉన్నారు. మామూలుగానే జక్కన్న ఆలస్యంగా సినిమాలు చేస్తారని పేరుంది. దానికి తోడు కరోనా, కరోనా కారణంగా విధిస్తున్న లాక్ డౌన్ లాంటి సమస్యలు దర్శక నిర్మాతలకు టెన్షన్ పెడుతున్నాయి. అనేక సార్లు వాయిదా వేసిన తర్వాత ఎట్టకేలకు మార్చి 25వ తేదీన రిలీజ్ చేసేందుకు జక్కన్న బృందం రెడీ అవుతోంది. అయితే అక్కడ కూడా రెండు సమస్యలు రెడీగా ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఏదో ఒక ఆటంకం

ఏదో ఒక ఆటంకం


జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'RRR'. ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సహా యావత్ భారత దేశం ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. అయితే ఎందుకో ఏమో కానీ తొలి నుంచి కూడా ఈ చిత్రానికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది.

రిలీజ్‌పై సందేహాలు

రిలీజ్‌పై సందేహాలు

పలు కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం... మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో మిగతా భారీ బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ డెట్లు పంచుకొని రెడీగా ఉన్నాయి. అయితే, తాజాగా RRR సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పరీక్షలకు తోడు ఐపీఎల్

పరీక్షలకు తోడు ఐపీఎల్


దానికి కారణం మార్చ్ నెలలో రిలీజ్ అంటే ఎగ్జామ్స్‌తో పాటుగా, ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావం భారీగా పడే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మార్చి నెల అంటే పరీక్షల సీజన్ అని అందరికీ తెలుసు. ఆ సమయంలో విద్యార్థులందరూ పరీక్షల ప్రిపరేషన్ లో ఉంటారు. అందుకే ముందు నుంచి కూడా ఆ సమయంలో సినిమాల రిలీజ్ లు పెట్టుకోరు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఆ పరీక్షలకు తోడు మార్చి చివరి వారంలో కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి.

ఆ రెండు షోలు

ఆ రెండు షోలు

అయితే అధికారికం కాదు కానీ ఆ మేరకు అంచనాలు అయితే ఉన్నాయి. అంతే కాక ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో, ఈ టోర్నీ సుదీర్ఘంగా కొనసాగనుంది. దీంతో ఒక పక్క పరీక్షలు, మరో పక్క ఐపీఎల్ సినిమా మీద ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లు సాయంత్రం మరియు రాత్రులలో జరుగుతాయి కాబట్టి, అన్ని ముఖ్యమైన మొదటి మరియు రెండవ షోల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు.

చూడాలి మరి

చూడాలి మరి


మరి జక్కన్న బృందం ఈసారి వీటిని పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది తెలియదు గానీ, మార్చ్‌లోనే రిలీజ్ చేస్తే మాత్రం అన్నీ భాషలలో వసూళ్ళ పరంగా ఆర్ఆర్ఆర్ మీద గట్టి ప్రభావమే చూపుతాయంటున్నారు విశ్లేషకులు. అయితే, సమ్మర్ అడ్వాంటేజ్ ఐపిఎల్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X