RRRలో ఎవరు ఊహించని మరొక సర్‌ప్రైజ్.. రాజమౌళి స్ట్రాటజీ మామూలుగా లేదు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల అప్డేట్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆడియెన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడా చూస్తామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ కూడా సర్‌ప్రైజ్ చేసేలా ఉంటుందని టీజర్ ట్రైలర్ తోనే అర్ధమయ్యింది. ఇక సినిమాలో ఎవరు ఊహించని సర్‌ప్రైజ్ మరొకటి ఉంటుందట. ఇక ఆ సర్‌ప్రైజ్ ఏమిటీ అనే వివరాల్లోకి వెళితే..

ఊహలకు అందడం లేదు..

ఊహలకు అందడం లేదు..

రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రేక్షకుల అంచనాలకి మించి ఉంటుందని చెప్పవచ్చు. ప్రతీ ఫ్రేమ్ కూడా పర్ఫెక్ట్ గా రావాలని ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఒక హీరోని చాలా పవర్ఫుల్ గా చూపించే రాజమౌళి ఇక నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ ను ఇంకా ఏ రేంజ్ లో చూపిస్తాడో ఊహలకు అందడం లేదు.

 మొదలైన కొన్ని నిమిషాలకు

మొదలైన కొన్ని నిమిషాలకు

రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు. ఇక ఇద్దరు కూడా సినిమాలో సమానంగా కనిపించారా లేదా అనే పాయింట్ కన్నా కూడా సినిమాలో ఇద్దరు అద్భుతంగా నటించారు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతారట. ఇక సినిమా మొదలైన కొన్ని నిమిషాలకు స్క్రీన్ పై చరణ్ తారక్ ను మర్చిపోయి భీమ్ రామ్ అనే రెండు క్యారెక్టర్స్ కథలోకి ప్రేక్షకులకు వెళ్లిపోతారు అని ఇటీవల రాజమౌళి చెప్పాడు.

 సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్

సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్

ఇక సినిమాలో ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుందని టీజర్ ట్రైలర్స్ విజువల్స్ చూసిన తరువాత చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఇక సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ప్రతీ 15 నిమిషాలకు ఒకటి ఉంటుందని ప్రతీ ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకుంటూ వచ్చారు.

ఎవరు ఊహించని మరొక సర్‌ప్రైజ్

ఎవరు ఊహించని మరొక సర్‌ప్రైజ్

ఇక ఎవరు ఊహించని మరొక సర్‌ప్రైజ్ కూడా సినిమాలో ఓ వర్గం అభిమానులకు ఎంతో కిక్ ఇస్తుందని తెలుస్తోంది. అదేమిటంటే.. రామ్ చరణ్ తేజ్, అలియా భట్ మధ్యలో వచ్చే ఒక మంచి సాంగ్ ప్రేక్షకులకు కనువిందుని కలిగిస్తుందట. వారిద్దరి మధ్య ప్రేమకు సంబంధించిన సీన్స్ మొత్తం ఆ సాంగ్ లోనే హైలెట్ కానున్నాయట. ఆ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా సర్‌ప్రైజ్ అవుతారని టాక్.

Recommended Video

RRR: India's Biggest Pre Release Event At Chikkaballapura | NTR | SS Rajamouli | Filmibeat Telugu
ఆ సీన్స్ కంటతడి పెట్టిస్తాయట..

ఆ సీన్స్ కంటతడి పెట్టిస్తాయట..

ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయని అర్ధమవుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ క్లాష్ ఎపిసోడ్స్ నుంచి వచ్చే సన్నివేశాలు మరో లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. వారిద్దరు కొట్టుకునే సీన్స్ కూడా ఆడియెన్స్ ను కంటతడి పెట్టిస్తాయని రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా తెలియజేశాడు. మరి సినిమాను చూసిన అనంతరం ఆడియెన్స్ ఎంతవరకు ఆ సన్నివేశాలకు కనెక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X