RRR రిలీజ్ డేట్.. ఆ హీరోకు మళ్ళీ తలనొప్పిగా మారిన జక్కన్న?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ RRR. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మొదటిసారి మెగా నందమూరి హీరోలు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి చిన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అయింది. ఇక విడుదలైన తీజర్స్ సాంగ్స్ కూడా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ను అందుకున్నాయి. తప్పకుండా సినిమా పాన్ ఇండియా మార్కెట్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తుందని చెప్పవచ్చు. ఇక దర్శకుడు రాజమౌళి బాహుబలి తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి బాలీవుడ్ లో కూడా ఈ మూవీపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి

అంతా బాగానే ఉంది కానీ RRR రిలీజ్ డేట్ పై చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే సినిమా దసరా బరిలో నిలిచేది. కానీ కరోనా వైరస్ లాక్ వలన సినిమా వాయిదా పడుతూనే ఉంది. అంతేకాకుండా ఇంత పెద్ద ఫ్యాన్ ఇండియా సినిమాకు రిలీజ్ డేట్ దొరకడం అంటే చాలా కష్టమైన పని. ఇక మిగతా సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా పండగ సీజన్ పైనే ఫోకస్ పెట్టాయి. ఇక రాజమౌళి కూడా మిగతా సినిమాల పోటీ గా ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ముందుగా సంక్రాంతి కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే టాలీవుడ్లో పోటీ తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ కు షిఫ్ట్ చేశారు.

RRR movie actor faces another issue from release date clash,

2022 ఏప్రిల్ లో చిబరలో త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే దాదాపు ఒక వారానికి అటూ ఇటూ గా అదే సమయంలో అజయ్ దేవగన్ మే డే సినిమా కూడా విడుదల కాబోతోంది. అజయ్ దేవ్ గన్ RRRలో ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆయన చేసిన మరొక సినిమాని అదే సమయంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ అదే సమయానికి రెండు సినిమాలు విడుదలకు సిద్ధమైంది అక్షయ్ కుమార్ కి తల పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తప్పకుండా RRR సినిమా ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా మేడే సినిమాను కూడా ఒక్కడే జనాల్లోకి తీసుకువెళ్లాలి బాధ్యత ఉంది.

కాబట్టి రెండు సినిమాలు ఒకేసారి ఒకే సమయంలో బాక్సాఫీస్ పోటీకి దిగితే మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై రాజమౌళి తో మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరక వచ్చాని అజయ్ దేవగన్ ఆలోచిస్తున్నాడట. అయితే 400 కోట్లు ప్రాజెక్టు కాబట్టే రాజమౌళి అలాగే నిర్మాత డివివి దానయ్య విడుదల విషయంలో వెనక్కి తగ్గకపోవచ్చని కూడా టాక్ వస్తోంది. అన్ని భాషలకు తగ్గట్లుగా రిలీజ్ డేట్ దొరకాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు కాబట్టి ఏప్రిల్ నెల కనుక అన్ని విధాలుగా సౌకర్యంగా అనిపిస్తే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X