RRR క్లైమాక్స్ ట్విస్ట్ లీక్: అవి లేకుండా తారక్‌, చరణ్‌ ఫైటింగ్.. ఇండియన్ సినిమాలోనే మొదటిసారి ఇలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఖర్చుకు వెనుకాడని బడా నిర్మాత.. హాలీవుడ్ బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్లు.. వీళ్లందరి కలయికలో వస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించాయి. అంతగా ఈ మూవీ ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో RRR క్లైమాక్స్ ట్విస్ట్ లీకైంది. చివర్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకలా.. చరణ్ మరోలా ఇబ్బంది పడతారట. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

రియల్ స్టార్లుగా మారిన టాలీవుడ్ హీరోలు

రియల్ స్టార్లుగా మారిన టాలీవుడ్ హీరోలు

'బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు రాజమౌళి. ఈ సూపర్ హిట్ సిరీస్ తర్వాత RRR (రౌద్రం రణం రుధిరం) అనే మూవీ చేస్తున్నాడు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

జక్కన్న దృష్టంతా దాని మీదే.. అప్‌డేట్లతో

జక్కన్న దృష్టంతా దాని మీదే.. అప్‌డేట్లతో

RRR మూవీ షూటింగ్ మొదలై రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ ఎన్నోసార్లు ఆటంకం ఏర్పడడం వల్ల చిత్రీకరణ చాలా వరకూ బ్యాలెన్స్ ఉండిపోయింది. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయలేదు. అయితే, ఈ మధ్యే క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలైంది. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా తరచూగా ఇస్తున్నారు.

ఇద్దరికీ భారీ రెస్పాన్స్... రికార్డులు బద్దలు

ఇద్దరికీ భారీ రెస్పాన్స్... రికార్డులు బద్దలు


తెలుగులోనే కాకుండా.. RRR మూవీ దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పరచుకుంది. అందుకే ఈ సినిమా నుంచి ఏది వచ్చినా ట్రెండ్ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టైటిల్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే సత్తాను నిరూపించాయి.

ఇదైనా నిజం చేయాలని.. పట్టుదలతో పని

ఇదైనా నిజం చేయాలని.. పట్టుదలతో పని


వాస్తవానికి RRR మూవీని జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021కి వాయిదా వేశారు. కానీ, లాక్‌డౌన్ సహా పలు కారణాల వల్ల ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ భారీ సినిమాను అక్టోబర్ 13, 2021న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వెల్లడించారు.

RRR టీమ్‌ను భయపెడుతోన్న అంశమిదే

RRR టీమ్‌ను భయపెడుతోన్న అంశమిదే


రాజమౌళి సినిమా అంటేనే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటోంది. కాబట్టి ఇందులోని ఏ అంశమైనా బయటకు వస్తే బాగుండు అని చూస్తుంటారు చాలా మంది. అందుకు అనుగుణంగానే RRR మూవీ ప్రారంభం అయినప్పటి నుంచే ఈ షూటింగ్‌కు సంబంధించిన ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉంది. దీంతో షూటింగ్ స్పాట్‌లోకి ఫోన్లు కూడా తీసుకు రావద్దన్నా లీకులు మాత్రం ఆగడం లేదు.

RRR క్లైమాక్స్ ట్విస్ట్ లీక్.. తట్టుకుంటారా?

RRR క్లైమాక్స్ ట్విస్ట్ లీక్.. తట్టుకుంటారా?


ప్రస్తుతం RRR మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో దాదాపు రెండు వందల మందితో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హీరోలు లేకుండానే ఈ షూటింగ్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి క్లైమాక్స్ ట్విస్ట్ బయటకు వచ్చింది. సినిమాలో ఈ సీన్ చూసి ఫ్యాన్స్ తట్టుకుంటారా అన్న సందేహాలు వస్తున్నాయి.

అవి లేకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫైటింగ్

అవి లేకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫైటింగ్


తాజా సమాచారం ప్రకారం.. RRR క్లైమాక్స్ ఫైట్‌లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ తన కంటి చూపును కోల్పోతాడట. అలాగే, కొమరం భీంగా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక కాలును కోల్పోతాడట. అంగ వైకల్యంతో ఉన్నా వీళ్లిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేశం కోసం పోరాటం చేస్తారని తెలిసింది. ఇలాంటి సీన్ ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్ అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X