twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR సినిమాపై ఏపీ ప్రభావం.. బిజినెస్ ను తగ్గించక తప్పడం లేదు!

    |

    దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి మెగా హీరో రామ్ చరణ్ తేజ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. కేవలం ఇరువర్గాల అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా బాహుబలి సినిమా హిట్ కావడంతో నార్త్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా రాజమౌళి మరొకసారి విజువల్ వండర్ చూపించబోతున్నాడు ఊహించుకుంటున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని కూడా ఆశిస్తున్నారు.

    రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పాత్రలతో పాటు మరొక పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించారు తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రం ప్రమోషన్ క్లారిటీ ఇచ్చేసింది. విడుదలైన టీజర్స్ కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. ఇక మొదటి పాట కూడా అన్ని భాషల్లోనూ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. సినిమా బిజినెస్ భారీ స్థాయిలో ఉంటుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు సినిమా మార్కెట్ కి తగ్గట్లుగా లేకపోవడంతో చిత్రం యూనియ్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    RRR Movie Coastal Andhra Business Ratio Reduced by around 30%

    కోస్టల్ ఆంధ్ర బిజినెస్ రేషియోలో 6 ప్రాంతాలకు దాదాపు 30% తగ్గించినట్లు తెలుస్తోంది. టికెట్ ధర పరిమితుల కారణంగా ఒక్కసారిగా రేషియోను తగ్గించినట్లు సమాచారం. అయితే మిగతా ఏరియాల్లో కూడా ఇదే తరహాలో ఫార్ములాను కొనసాగిస్తారా లేదా ఎప్పటిలానే అదే రేషియోను కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ RRR సినిమా ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నంత స్థాయిలో వసూళ్లను అందుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ టికెట్ల రేట్ల విషయంలో ఇండస్ట్రీలో తగ్గట్టుగా పాత రూల్ ను తీసుకువస్తే ఈజీగా లాభల్లోకి అవకాశం ఉంటుంది. ఇలాంటి పెద్ద సినిమాలకు వీలైనంత త్వరగా పెట్టిన పెట్టుబడిని లాభాలు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన తర్వాత పైరసీ భూతం వలన చాలా వరకు కలెక్షన్స్ అయితే తగ్గుతాయి.

    అంతేకాకుండా ఆలస్యమైన కొద్దీ థియేటర్స్ లో సినిమాను చూడాలనే ఆసక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మొదటి వారంలోనే భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే దిశగా ఉంటే బాగుంటుందని చిత్ర నిర్మాతలు ఇదివరకే ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు. నిర్మాతలు దర్శకులు చాలా సార్లు ఏపీ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు అందుకే కొంతమంది నిర్మాతలు థియేటర్స్ లో సినిమాలను రిలీజ్ చేయ లేక డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసుకోవాల్సి వస్తోంది. ఇక RRR సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

    English summary
    RRR Movie Coastal Andhra Business Ratio Reduced by around 30% ,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X