ఆర్ఆర్ఆర్: బేధాభిప్రాయాలు వెచ్చేశాయ్.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన నిర్మాత!

Recommended Video

Differences Between Rajamouli And DVV Danayya || Filmibeat Telugu

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న ఈ సినిమాను ప్రకటించాడో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్నివర్గాల ప్రేక్షకులు భారీ అంచానాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఊహించని అడ్డంకులు వస్తుండటం కాస్త నెగెటివ్ సెంటిమెంట్ తీసుకొస్తోంది. ఇది గాక తాజాగా రాజమౌళి, దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త మెగా, నందమూరి అభిమానులను కలవరపెడుతోంది.

భారీ హంగులతో నిర్మాణం

భారీ హంగులతో నిర్మాణం

ఆర్ఆర్ఆర్ నెలకొన్న హైప్ చూసి అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి భారీ హంగులతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు డీవీవీ దానయ్య. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సరిగ్గా ఈ తరుణంలో చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమనడంతో ఆశ్చర్య పోతున్నారు ప్రేక్షకులు.

బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాల్లో

బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాల్లో

ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య సఖ్యత లోపించిందని, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా వీరిరువురు ఎడ మెహం పెడ మొహంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే భారీ సినిమా కావడంతో ఇలాంటి సంఘటన ఏమంత మంచిది కాదని భావించిన నిర్మాత కొర్రపాటి సాయి వీరిద్దరి మధ్య రాయబారాలు నడుపుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొస్తున్నాయి.

కొర్రపాటి సాయి ప్రయత్నాలు

కొర్రపాటి సాయి ప్రయత్నాలు


బేసికల్ గా అటు రాజమౌళికి ఇటు దానయ్యకు నిర్మాత కొర్రపాటి సాయి చాలా సన్నిహితుడు కావడంతో వీరిద్దరిని ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సినిమాకు సంబంధించి బిజినెస్ డీల్స్ అన్నీ చిత్ర షూటింగ్ పూర్తయిన తర్వాతనే ఫైనల్ చేద్దామని రాజమౌళి ఆలోచన కాగా, ఇప్పటి నుంచే బిజినెస్ డీల్స్ వ్యవహారం ఓపెన్ చేద్దామని దానయ్య ఆలోచన కావడంతో ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు టాక్.

కావాలనే పుట్టించారా? లేక..

కావాలనే పుట్టించారా? లేక..

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ హైప్ ఉండటంతో కొందరు వ్యక్తులు కావాలనే ఇలాంటి వార్తలు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు తప్ప.. రాజమౌళి, దానయ్యల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు తలెత్తలేదనే మరో ప్రచారం కూడా వినిపిస్తోంది ఫిలిం నగర్ వీధుల్లో. చూడాలి మరి దీనిపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది.

ఆర్ఆర్ఆర్ మూవీ.. ఎన్టీఆర్ హీరోయిన్

ఆర్ఆర్ఆర్ మూవీ.. ఎన్టీఆర్ హీరోయిన్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. చెర్రీ సరసన నటించే ఆలియా భట్ ఇప్పటికే సెట్స్ పై వాలిపోగా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

More from Filmibeat

Read more about: rrr ram charan rajamouli danayya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X