మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సూపర్ స్టార్ సినిమాపై RRR ఎఫెక్ట్..

రాబోయో బిగ్ బడ్జెట్ సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలే కాకుండా ప్రీ ప్రొడక్షన్ దశలో కూడా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో స్టార్ హీరోలు నెక్స్ట్ ప్రాజెక్టులపై ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. రాజమౌళి RRR కారణంగా మహేష్ సినిమాపై కూడా ఒక ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.

RRR సినిమాపై రూమర్స్

RRR సినిమాపై రూమర్స్

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ ధైర్యంగా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అసలు షూటింగ్స్ స్టార్ట్ చేస్తారా లేదా అనే సందేహంలో చాలా మంది ఉన్నారు. ఇక ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న RRR సినిమాపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. సినిమా షూటింగ్ ఇంకా 30శాతం పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆ ఎఫెక్ట్ మహేష్ బాబుపై పడే ఛాన్స్ ఉంది.

రాజమౌళితో మహేష్ బాబు..

రాజమౌళితో మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. మహేష్ కి ఆ సినిమాను పూర్తి చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఆ తరువాత రాజమౌళితో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

 RRR కోసం మరో ఏడాది

RRR కోసం మరో ఏడాది

అయితే వచ్చే ఏడాది మొదలవ్వాల్సిన రాజమౌళి మహేష్ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదని టాక్ వస్తోంది. ఎందుకంటే మహేష్ రెడీగా ఉన్నప్పటికీ రాజమౌళి రెడీగా ఉండడట. ఎందుకంటే RRR కోసం మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. 2021లో RRR వస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీగా చెప్పలేదు. దీంతో రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది లేనట్లే అనే టాక్ కూడా వస్తోంది.

Recommended Video

Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
ఆ సినిమా 2022లోనే..

ఆ సినిమా 2022లోనే..

అసలైతే మొదట్లో సర్కారు వారి పాట అయిపోతే అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయాలని అనుకున్న మహేష్ రాజమౌళి ఓకే చెప్పడంతో అనిల్ ని పక్కనపెట్టాడు. ఇక రాజమౌళితో చేయాల్సిన సినిమా 2022 అంటే మధ్యలో ఒక సినిమా చేసే ఉంటుంది. కాబట్టి మళ్ళీ అనిల్ రావిపూడిని లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X