twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ఫైనల్ కట్ రెడీ.. రన్ టైమ్ ఎంతంటే? చివరి అరగంట హైలెట్ అయ్యేది అదే!

    |

    కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో RRR సినిమా మొదటి స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. సినిమాపై ఉన్న అంచనాలు అయితే ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి. బాహుబలి విజయం అనంతరం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమకులు ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి దర్శకుడు రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి RRR ఫైనల్ కట్ రెడీ చేశాడు. ఇక సినిమా రన్ టైమ్ ఎంత? ఇలాంటి సీన్స్ ఎంతసేపు ఉంటాయి? అనే వివరాల్లోకి వెళితే...

    సినిమా హీరోలకు కూడా చూపించకుండా..

    సినిమా హీరోలకు కూడా చూపించకుండా..

    దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ అనంతరం అంతకుమించి అనేలా తెరకెక్కించిన RRR సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇక రాజమౌళితో పరిచయం ఉన్న చాలామంది సినిమా గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం కనీసం సినిమా హీరోలకు కూడా ఫైనల్ కట్ గురించి ఏ మాత్రం చెప్పడం లేదట. సినిమాను ఇంత వరకు సరిగ్గా చూపించలేదు అని రామ్ చరణ్ తేజ్ ఆ మధ్య బిగ్ బాస్ షోలో ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే.

    సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్

    సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్

    RRR సినిమా ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి మొదటి సారి తన సినీ జీవితంలోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 450కోట్ల వరకు ఖర్చు చేశారు. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు, పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేశాయి.

    రిలీజ్ డేట్ ఫిక్స్

    రిలీజ్ డేట్ ఫిక్స్

    గత కొంతకాలంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్న రాజమౌళి మొత్తానికి ఫైనల్ కట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. అసలైతే సినిమాలు ఈ దసరా సమయానికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగో లేకపోవడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వలన జనవరి 7వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియల్ పోస్టర్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

    సినిమా రన్ టైన్ ఎంతంటే?

    సినిమా రన్ టైన్ ఎంతంటే?

    ఈ సినిమా నిడివి ఎంత ఉంటుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రెండు గంటల 45 నిమిషాల పాటు వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి గతంలో చాలా వరకు తన సినిమాల రన్ టైమ్ విషయంలో రెండు గంటల 30 నిమిషాల లోపే ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. బాహుబలి పార్ట్ 2 మాత్రం 2గం 47నిమిషాలు పెట్టింది. ఇక RRR సినిమా కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటోంది. సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు మంచి ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో చూపించక తప్పడం లేదు.

    Recommended Video

    Radhe Shyam Teaser: Pan India లో టాలీవుడ్ పాగా Prabhas Radhe Shyam Vs RRR || Filmibeat Telugu
    చివరి 30 నిమిషాలు..

    చివరి 30 నిమిషాలు..

    RRR సినిమాలో చివరి అరగంట సేపు బాహుబలి పార్ట్ వన్ తరహాలోనే ఎమోషన్స్ తో కూడిన మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 30 నిమిషాలు మరొక ఎత్తు అనేలా ఉంటుందట. దర్శకుడు రాజమౌళి యాక్షన్ సీన్స్ తోనే మంచి ఎమోషన్స్ ను చూపిస్తాడు అని చాలాసార్లు రుజువైంది. ఇక RRR సినిమాలో కూడా అలాంటి కంటెంట్ చాలా ఉంది అని ఇదివరకే రచయిత కె.విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

    English summary
    RRR movie final cut ready rum time fix and last 30 minutes highlight scenes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X