RRR Introduction Scene: సినిమాలో ఇద్దరి హీరోలలో ముందు ఎవరు కనిపిస్తారంటే.. పవర్ఫుల్ ఎంట్రీ!

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సినిమా కోసం గత రెండేళ్లుగా ఇరువర్గాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక వెండితెరపై ఇద్దరు హీరోలను దర్శకుడు రాజమౌళి ఏ విధంగా బ్యాలెన్స్ చేశాడు అనేది అందరిలో మెదులుతున్న అతి పెద్ద సందేహం.

కథపరంగా ఇద్దరికీ సమానమైన నిడివి ఉంటుంది అని చెప్పిన రాజమౌళి ఇంట్రడక్షన్ సీన్స్ కూడా ఇద్దరివి హైలెట్గా ఉంటాయని చెప్పాడు. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ముందుగా ఏ హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఫిక్షనల్ తరహాలో..

ఫిక్షనల్ తరహాలో..

రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఒక కల్పితమైన కథను సిద్ధం చేసుకున్న రాజమౌళి పూర్తిగా ఫిక్షనల్ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు మొదట్లోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమా పై అంచనాల సంగతి పక్కన పెడితే అసలు అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అందరిలో మరొక పెద్ద సందేహంగా మారింది.

హీరోల ఫ్రెడ్షిప్

హీరోల ఫ్రెడ్షిప్

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అని వారు రెగ్యులర్గా ఇస్తున్న ఇంటర్వ్యూ లతోనే క్లారిటీ వచ్చేసింది. సినిమా మొదకవ్వకముందే వాళ్ళిద్దరు మంచి స్నేహితులని కూడా చెప్పుకున్నారు. ఇక ఈ సినిమా తెరపైకి వస్తున్న సందర్భంలో ఇంటర్వ్యూలలో కూడా ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా రిలీజ్ వేడుకలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు.

ఇంకా కొంతమంది మారలేదు

ఇంకా కొంతమంది మారలేదు

మేమిద్దరం మంచి స్నేహితులం అని అలాగే అభిమానులు కూడా అంతే స్నేహం గా ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి చెబుతున్నారు. ఓ వర్గం అభిమానులకు ఇది ఆనందించే విషయమే అయినప్పటికీ మరి కొంత మంది అభిమానులు మాత్రం ఇంకా సరైన తరహాలో ఆలోచించడం లేదు. సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా అదే తరహాలో తిట్టుకుంటూ ఉంటున్నారు.

సినిమా చూసిన తరువాత..

సినిమా చూసిన తరువాత..

ఇక సినిమాలో అయితే రాజమౌళి ఇద్దరు హీరోలను సమానంగా చూపించినట్లుగా చెబుతున్నాడు. ఇక ఫ్యాన్స్ కూడా ఒకసారి సినిమాలు చూడటం స్టార్ట్ చేస్తే పది నిమిషాల తర్వాత రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ లను మర్చిపోయి రామ్ భీమ్ పాత్రలను మాత్రమే చూస్తారు అని చెబుతున్నారు. సినిమాలో ప్రతి ఎమోషన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని కూడా అంటున్నారు.

ముందు ఎవరంటే..

ముందు ఎవరంటే..

అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంట్రడక్షన్ సన్నివేశం లో ముందు ఎవరు కనిపిస్తారు అనే విషయం లో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ముందుగా రామ్ చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు వస్తాయట. బ్రిటిష్ విలన్స్ ను కూడా రామ్ చరణ్ తో పాటు పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

RRR Road Show: NTR, Ram Charan And Rajamouli Visits Statue of Unity | Filmibeat Telugu
టైగర్ తో ఎంట్రీ!

టైగర్ తో ఎంట్రీ!

ఇక రామ్ చరణ్ సీన్స్ వచ్చిన తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందట. అయితే మొదట రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు అనే ఫీలింగ్ తో చూడకుండా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని కూడా రాజమౌళి మరింత పవర్ఫుల్ గా చూపించినట్లు తెలుస్తుంది. ఎంట్రీలోనే ఒక టైగర్ తో పోరాడే విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X