RRR షూటింగ్.. సాధ్యమయ్యే పనేనా? తేడా వస్తే ఎఫెక్ట్ తప్పదు
కరోనా వైరస్ దరిద్రం మొత్తం సినిమా ఇండస్ట్రీలపైనే పడినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాల పరిస్థితి చాలా భయంకరంగా మారింది. గత ఆరు నెలల నుంచి సింగిల్ షాట్ కూడా షూట్ చేయలేదు. చిన్న సినిమాల సంగతి పక్కనపెడితే ఎలాగోలా 50 కంటే తక్కువ మందితో షూట్ చేయవచ్చు. కానీ RRR వంటి సినిమాకు అలా కుదరదు. మినిమమ్ 150 మంది కావాల్సిందే.
ఇక జూనియర్ ఆర్టిస్టులు కావాలి అంటే ఆ సంఖ్య ఈజీగా వేలల్లోకి వెళుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ అడుగు ముందుకు వేయనియ్యడం లేదు. ఇక తారక్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఎక్కువగా మిగిలి ఉండడంతో ఎలాగైనా అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనేనా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆరు నెలల క్రితం రెడీ చేసిన సెట్స్ ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరిలో వేసిన ఆ సెట్స్ ఇప్పటికే సగం సిద్దమైనట్లు టాక్. ఇక అక్టోబర్ నెలలోనే RRR షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ కానుందట. అంతా బాగానే ఉంది గాని యూనిట్ లో ఒక్కరికి వైరస్ వచ్చినా కూడా మళ్లీ కథ మొదటికి వస్తుంది. ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది.
మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక తారక్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయితే మంచి రోజు చూసుకొని టీజర్ ని రిలీజ్ చేయాలని జక్కన్న ఒక కొత్త ప్లాన్ వేసుకున్నాడు. మరోవైపు తారక్ డేట్స్ దొరికితే తన సినిమాను లాంచ్ చేయాలని త్రివిక్రమ్ కూడా గట్టిగానే ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











