RRR సర్‌ప్రైజ్‌: ట్రైలట్ కూడా రెడీ.. మరో డేట్ ఫిక్స్ చేసుకున్న రాజమౌళి టీమ్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా RRR సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటిసారి నందమూరి మెగా అభిమానులకు కలిసి సెలబ్రిటీ చేసుకోబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరు కూడా అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ వెండితెరపై వండర్స్ క్రియేట్ చేయబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

రెండు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్స్ రెండు కూడా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేశాయి. సినిమా మరొక లెవెల్ లో ఉంటుంది అని ఇప్పటికే టీజర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా అన్ని భాషల్లోనూ మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తోంది. ప్రమోషన్స్ విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చిత్రయూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ను రూపొందిస్తోంది. ప్రేక్షకులు సినిమాను కొంచెం కూడా మర్చిపోకుండా దర్శకుడు రాజమౌళి అద్భుతమైన సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. దర్శకుడు రాజమౌళి బాహుబలి సమయంలోనే తీరిక లేకుండా ప్రమోషన్స్ చేసి సినిమాను ఇండియన్ నెంబర్ వన్ బాక్సాఫీస్ హిట్ అయ్యేలా చేశాడు. ఇక ఈ విషయంలో కూడా అదే తరహాలో ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలైన ట్రైలర్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

RRR movie latest update on trailer release date and final cut

ఇప్పటికే ట్రైలర్ ను కట్ చేసి రెడీగా ఉంచినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలతో పాటు అజయ్ దేవగన్ పాత్రను కూడా ట్రైలర్ లో హైలెట్ గా ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే విషయంలో కూడా దర్శకుడు రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా మూడో పాటను కూడా ఈనెలలోనే విడుదల చేస్తారని టాక్ అయితే వచ్చింది. ఇక ఆ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ట్రైలర్ అయితే డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. డిసెంబర్ 4వ తేదీన ట్రైలర్ విడుదల కావచ్చు అని కథనాలు వెలువడుతున్నాయి.

ఆ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అలియా భట్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది కాబట్టే ట్రైలర్లో ఆమెకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ కూడా వినిపిస్తాయని తెలుస్తోంది. ఇక సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఊహించని ట్విస్టులు ఉంటాయని కూడా రచయిత విజయేంద్రప్రసాద్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఫైనల్ క్లైమాక్స్ లో అయితే ఎమోషనల్ ఫైట్ సీన్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు యుద్ధానికి సిద్ధం అవుతారని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. RRRను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X