twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులోకి... చెర్రీని తీసుకొచ్చింది జూనియరా?

    By Bojja Kumar
    |

    బాహుబలి ప్రాజెక్టు తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ ఊహించినట్లే మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన జక్కన్న. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ #ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. రూ. 250 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత డివివి దానయ్య ప్రకటించడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.

     మొదట మల్టీ స్టారర్ అనుకోలేదా?

    మొదట మల్టీ స్టారర్ అనుకోలేదా?

    బాహుబలి చేస్తున్న సమయంలోనే తర్వాతి సినిమా తారక్‌తో చేయాలని ప్లాన్ చేసుకున్నాడట రాజమౌళి. ఎన్టీఆర్‌ కోసం మంచి కథ కోసం అన్వేషించాడట. మల్టీ స్టారర్ తీద్దామనే ఉద్దేశ్యం మొదట ఆయనకు లేనప్పటికీ.... స్క్రిప్టు ఫైనల్ అయిన తర్వాత ఇంకో హీరో కూడా అవసరం అయ్యాడని టాక్.

    రామ్ చరణ్ అయితే బెస్ట్ అని సూచించిన తారక్

    రామ్ చరణ్ అయితే బెస్ట్ అని సూచించిన తారక్

    మరో హీరోగా ఎవరిని తీసుకుందాం? అని రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య చర్చలు జరిగినపుడు రామ్ చరణ్ అయితే పర్ఫెక్టుగా సూటవుతాడని ఎన్టీఆర్ సూచించారని, రాజమౌళి కూడా తాను అనుకున్న పాత్రకు చరణ్ బాగా సూటవుతాడని డిసైడ్ కావడంతో....... ఈ చిత్రాన్ని ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌గా చేయాలని నిర్ణయించుకున్నారట.

    ఇద్దరూ రాజమౌళి మెచ్చిన హీరోలే

    ఇద్దరూ రాజమౌళి మెచ్చిన హీరోలే

    రాజమౌళి, ఎన్టీఆర్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తారక్ మూవీతోనే రాజమౌళి తన కెరీర్ ప్రారంభించారు. వీరి కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ లాంటి భారీ హిట్లు వచ్చాయి. ఇక రామ్ చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర' మూవీ భారి విజయం అందుకుంది.

    హైదరాబాద్‌లో భారీ సెట్స్?

    హైదరాబాద్‌లో భారీ సెట్స్?

    మరో మూడు నెలల్లో ఈచిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట‌, ఈ సెట్‌లో యాక్షన్‌ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ వేయబోతున్నట్లు సమాచారం.

    రెండేళ్ల పాటు షూటింగ్?

    రెండేళ్ల పాటు షూటింగ్?

    సినిమా షూటింగు కోసం నిర్మాతలు రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు రెండు సంవత్సరాలకు ల్యాండ్ లీజుకు తీసుకున్నారట. దీంతో ఈ చిత్రం షూటింగ్ సుధీర్ఘ కాలం పాటు సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.

    రూ. 250 కోట్ల భారీ బడ్జెట్

    రూ. 250 కోట్ల భారీ బడ్జెట్

    బాహుబలి తర్వాత రాజమౌళి భారీ సినిమాలు తీయాలనే దానిపై దృష్టి పెట్టారని... రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రం రూ. 250 కోట్ల ఖర్చుతో భారీగా తెరకెక్కించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

    English summary
    Recently the Production Designer of the film Sabu Cyril has started working on the sets of #RRR. While a couple of sets are getting erected at Ramoji Film City, another one is being constructed adjacent to Aluminium Factory. Reports are coming that producers of #RRR took that land for a lease of two years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X