RRR పైరసీ అవ్వకుండా స్పెషల్ కేరింగ్.. అయినప్పటికీ ఆ ఒక్క రూట్లో చిత్ర యూనిట్ కి ఎదురుదెబ్బ
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న RRR సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. రాజమౌళి సినిమా కాబట్టి తప్పకుండా సంచలనాత్మకమైన పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది అని ఒక నమ్మకం ఉన్నప్పటికీ ఫైనల్ గా ఈ సినిమా రిజల్ట్ అంచనాలను అందుకుందా లేదా అనే విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో అయితే దర్శకుడి మరొకసారి సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు పైరసీ దెబ్బ పడకుండా ఉండదు అని చెప్పాలి. ఆ విషయంలో ముందు నుంచి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్న చిత్ర యూనిట్ సభ్యులకు ఒక వైపు నుంచి మాత్రం చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

థియేటర్స్ లో చూస్తేనే
ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవల కాలంలో అయితే పైరసీ ప్రభావం తీవ్ర స్థాయిలో చూపిస్తోంది. ఇక ప్రస్తుతం RRR సినిమాపై కూడా ఆ ప్రభావం చూపించే అవకాశం అయితే చాలానే ఉంది. మెగా నందమూరి అభిమానులు సినిమాలు కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అని దర్శకుడు రాజమౌళి టీజర్ ట్రైలర్ తోనే చూపించేసాడు. అయితే ఎలాంటి సినిమాను థియేటర్స్ లో చూస్తేనే మంచి అనుభూతి ఉంటుందని చెప్పవచ్చు.

టికెట్ల రేట్లతో కంగారు
అయితే ఈ సినిమాకు టికెట్ల రేట్లు భారీ ధరకు నిర్ణయించడం ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచి నలుగురు సినిమా కు వెళ్లాలి అంటే దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు 500 రూపాయలతో కుటుంబ సభ్యులు అందరూ కూడా సినిమా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు RRR వచ్చే సమయానికి ఒక్క టికెట్ ధర నాలుగు వందల రూపాయలకు పైగా నిర్ణయించడంతో మధ్యతరగతి ఫ్యామిలీ సినిమాలు కలిసి చూసేందుకు కాస్త ఆలోచనలో పడేసింది.

ముందు జాగ్రత్తలు
సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో ఓ వర్గం ప్రేక్షకులు ఎక్కువగా పైరసీ వైపు యూటర్న్ తీసుకునే ప్రమాదం అయితే ఉంది. ఈ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా సరే విడుదల అయినా మొదటి షో తర్వాత పైరసీ అవుతూ వెబ్సైట్లలో విచ్చలవిడిగా హడావిడి అవుతూ ఉండడం విశేషం. అయితే ఆ ఇబ్బంది రాకుండా ముందుగానే RRR యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా అందుకోసం ఒక టీమ్ ను ఏర్పాటు చేసే లింక్స్ డిలీట్ చేసే విధంగా కేర్ఫుల్ గా ఉంటుంది.
Recommended Video


ఆ రూట్లో కష్టమే..
అయితే సినిమా టికెట్లు భారంగా అనిపించే వారు మాత్రం పైరసీ రూపంలో సినిమా చూసే అవకాశం ఎంతైనా ఉంది ఇక ఈ సినిమాకు సంబంధించిన పైరసీ లింక్స్ అయితే ఎక్కువగా టెలిగ్రామ్ యాప్ లోనే క్రియేట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఒక్క బటన్ తో సినిమా మొత్తం డౌన్లోడ్ చేసుకునే విధంగా ఆప్షన్ ఉండడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు అందులోనే సెర్చ్ చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులకు అక్కడి నుంచి చేదు అనుభవం ఎదురవుతోందట. డిలీట్ చేసినా కూడా వందల సంఖ్యలో లింక్స్ పుట్టుకొస్తున్నాయి. మరి ఎంత సేపు పైరసీతో పోరాడతారో చూడాలి.


Click it and Unblock the Notifications











