RRR రిలీజ్‌పై సెన్సేషన్ న్యూస్ లీక్: మరోసారి వాయిదా ఖాయం.. మూవీ కోసం అన్ని రోజులు ఆగాల్సిందే!

తెలుగు సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌‌తో బడా మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినా.. చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. దీంతో పలుమార్లు ఇది వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే RRR మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కొత్త రిలీజ్ డేట్‌పైనా క్లారిటీ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

రియల్ హీరోల కథతో వస్తున్న RRR

రియల్ హీరోల కథతో వస్తున్న RRR

స్వాతంత్ర్యానికి పూర్వం ప్రజా సమస్యలకై పోరాటం చేసి వీర మరణం పొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ నటిస్తున్నారు.

క్లైమాక్స్ మొదలు.. కరోనాతో వాయిదా

క్లైమాక్స్ మొదలు.. కరోనాతో వాయిదా

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే పూర్తయింది. కానీ, అనివార్య కారణాల వల్ల పలు ఆటంకాలు ఎదురవడంతో ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదు. ఇక, ఇటీవలే క్లైమాక్స్ సీన్‌ చిత్రీకరణను ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ వేశారు. ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో ఈ షూటింగ్‌ను వాయిదా వేశారు.

 ఇద్దరూ వచ్చారు.. రికార్డులు కొట్టేశారు

ఇద్దరూ వచ్చారు.. రికార్డులు కొట్టేశారు

RRR మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీని నుంచి ఏది వచ్చినా ట్రెండ్ సెట్ చేస్తోంది. రికార్డు బద్దలు కొడుతోంది. ఈ మూవీ నుంచి మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి.

రిలీజ్‌కు ముందే నేషనల్ రికార్డుకు బ్రేక్

రిలీజ్‌కు ముందే నేషనల్ రికార్డుకు బ్రేక్

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం)పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఈ చిత్రం అమ్ముడు పోవడం విశేషం.

రిలీజ్‌ వాయిదా.. ఈ సారి కూడా అంటూ

రిలీజ్‌ వాయిదా.. ఈ సారి కూడా అంటూ

నిజానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ తేదీ కూడా మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

RRR రిలీజ్‌పై సెన్సేషన్ న్యూస్ బయటకు

RRR రిలీజ్‌పై సెన్సేషన్ న్యూస్ బయటకు

తాజా సమాచారం ప్రకారం.. RRR మూవీ వాయిదా పడడం దాదాపుగా ఖాయం అని తెలిసింది. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు.. ఒకవేళ తగ్గినా షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో దీన్ని మరోసారి వాయిదా వేయడమే మేలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.

Recommended Video

Megaatar Chiranjeevi Daughter To Debut In Tamil Remake | సక్సెస్ అవుతుందా?
మూవీ కోసం అన్ని రోజులు ఆగాల్సిందే

మూవీ కోసం అన్ని రోజులు ఆగాల్సిందే

RRR కొత్త రిలీజ్ డేట్‌పైనా తాజాగా క్లారిటీ వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట జక్కన్న. అది కూడా ఓ లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా కోసం మరో ఏడాది కాలం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X