Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బ్రేకింగ్: RRR వాయిదా.. రాజమౌళి షాకింగ్ నిర్ణయం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?
బాహుబలి మూవీ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR చిత్రం రిలీజ్ ఎప్పుడవుతుందని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాను అనౌన్స్ చేసినప్పుడే RRR రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా రిలీజ్ డేట్‌ను మార్చారనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
350 కోట్ల బడ్జెట్‌తో
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలయికతో ఈ భారీ ప్రాజెక్టును జూలై 30న రిలీజ్ లక్ష్యంగా ప్లాన్ చేశారు. అయితే సినిమా షూట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదోరకమైన ఆటంకం ఎదురవుతూనే ఉంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్టు సమాచారం.
ప్రాజెక్టుకు పలు అవాంతరాలు
RRR షూటింగ్ మొదలైనప్పటి నుంచి హాలీవుడ్ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడంతోపాటు సినిమాకు పలు అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో నటీనటుల కాల్షీట్స్, ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.
దసరా పండగ కానుకగా
కంప్యూటర్ గ్రాఫిక్స్, సినిమా సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాకపోవడం, అది జూలై నెలాఖరు వరకు పూర్తి అయ్యేలా లేకపోవడంతో దర్శకుడు రాజమౌళి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. జూలై 30 నుంచి దసరా పండగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పండగ సీజన్లో తాజాగా కొన్ని సినిమాలు వసూళ్లు రాబట్టడం చూసి కూడా కొంత ప్రభావం చెందినట్టు తెలుస్తున్నది.
Recommended Video
రిలీజ్ డేట్ అక్టోబర్ 23?
RRR సినిమా వాయిదా పడినట్టు సోషల్ మీడియాలో ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పరోక్షంగా స్పందించారు. ‘మీకు ఇది ఎక్స్‌క్లూజివ్.. ఓ భారీ చిత్రం, దక్షిణాది నుంచి ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సినిమా వాయిదా పడింది. ఆ సినిమా కోసం ముందుగా ప్రకటించిన డేట్ కంటే మరో డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2020లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. దాంతో ఈ సినిమా అక్టోబర్ 23న రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ సినిమా ఏమిటో గుర్తు పట్టండి అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.