ఆర్ఆర్ఆర్: రాజమౌళి నుంచి మరో అనౌన్స్‌మెంట్!
'బాహుబలి'తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి... 'ఆర్ఆర్ఆర్' పేరుతో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 11.11.11 ముహూర్తాన ప్రారంభించారు.
సినిమా అయితే ప్రారంభం అయింది కానీ... హీరోయిన్లు ఎవరు? ముఖ్యమైన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? అనే విషయాలు వెల్లడించలేదు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటింస్తూ రాజమౌళి నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతుననట్లు సమాచారం.

ఈ వివరాలు వెల్లడించేందుకు 12.12.12 ముహూర్తాన్ని రాజమౌళి ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టెన్మెంట్స్ నుంచి కానీ, రాజమౌళి నుంచి ఈ విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రియమణి కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో గతంలో ప్రియమణి 'యమదొంగ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరరెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చిన ఈ మూవీ స్వాతంత్ర్యం రావడానికి ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











