రాజమౌళి #ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వివరాలు లీక్?
Recommended Video

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో #ఆర్ఆర్ఆర్ పేరుతో ప్రేక్షకుల ఊహకు కూడా అందని భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టును ప్లాన్ చేశాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు డీవీవీ దానయ్య ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా కాన్సెప్టు ఏమిటి? అనే విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. గతంలో పలు రకాల వార్తలు వినిపించినా... అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. తాజాగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి మరో రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో?
రాజమౌళి #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.

హిస్టారికల్ సినిమా అని రాజమౌళి ఎప్పుడూ చెప్పలేదు
#ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ హిస్టారికల్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమా అని ఇప్పటి వరకైతే రాజమౌళి చెప్పలేదు. మరి అల్లూరి సీతారామరాజు పాత్రకు #ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధం ఏమిటి? అనేది అంతు పట్టడం లేదు.

‘బాహుబలిని' మించి పోయేలా
రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. చేసిన సినిమాలు తక్కువే అయినా ఒకదానికి మించి మరొక సినిమా చేస్తూ, సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ఇండియాలోనే అగ్రదర్శకుడిగా ఎదిగాడు. ఇపుడు చేయబోయే #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కూడా బాహుబలిని మించి పోయేలా ఉంటుందని అంటున్నారు.

అక్కడే మకాం, పూర్తి డెడికేటెడ్‌గా
రాజమౌళి ఏదైనా సినిమా కమిట్ అయ్యాడంటే... అది పూర్తయ్యే వరకు తన పూర్తి సమయం కేటాయిస్తాడు. బాహుబలి కోసం రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఐదేళ్లు రాత్రింభవళ్లు అనే తేడా లేకుండా డెడికేటెడ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం కూడా అలాగే చేయబోతున్నారట. సినిమా సెట్ పక్కనే టెంపరరీ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడట.

పక్కా ప్లానింగ్
రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్లానింగ్ భారీగా ఉంటుంది. తను తీయబోయే సినిమా బడ్జెట్‌కు తగిన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటారు. అలా పర్ఫెక్టుగా ప్లానింగ్ చేశారు కాబట్టే బాహుబలి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘ఆర్ఆర్ఆర్' విషయంలోనూ రాజమౌళి అలాంటి ప్లానింగే చేస్తున్నారట.

రంగంలోకి కరణ్ జోహార్
రూ. 300 కోట్ల బడ్జెట్ సినిమా అంటే కేవలం తెలుగు, తమిళంలో అయితే వర్కౌట్ కాదు. ఇండియాలో ఎక్కువ మార్కెట్ హిందీ సినిమాలకే ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అక్కడ మార్కెటింగ్ చేసేందుకు కరణ్ జోహార్‌ను రంగంలోకి దింపబోతున్నారట.

ఆ హీరోయిన్ల పేర్లు
‘ఆర్ఆర్ఆర్' చిత్రం నవంబర్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయకు రాలేదు. ఇందులో సమంత, అలియా భట్, కీర్తి సురేష్ ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











