RRR డిమాండ్.. ఓవర్‌సీస్ బిజినెస్ ఈ రేంజ్‌లో జరిగిందా..?
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల కన్ను కేవలం ఆర్ఆర్ఆర్ పైనే ఉంది. బాహుబలి సిరీస్ లాంటి భారీ విజయం తర్వాత రాజమౌళి సినిమా కావడం, ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఒకే తెరపైకి రానుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. వీరి ఆతృతను మరింత పెంచేలా ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్ ఓవర్‌సీస్ బిజినెస్ తాజాగా వినిపిస్తున్న వార్త టాలీవుడ్ జనాల్ని ఆశ్చర్య పరుస్తోంది.
కానీ వినీ ఎరుగని హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్స్ చాలా ఆసక్తి చూపుతున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్‌సీస్ బిజినెస్ క్లోజ్ చేశారనే సమాచారం అందింది. సినిమా నిర్మాణం పూర్తి కాకముందే భారీ క్రేజ్ కొట్టేసిన ఈ సినిమా ఓవర్‌సీస్ రైట్స్ కోసం ఏకంగా 65 కోట్ల రూపాయలు వెచ్చించిందట దుబాయ్ కి చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. అన్ని భాషలకు సంబంధించిన ఓవర్ సీస్ హక్కులను ఈ సంస్థ చేజిక్కించుకుందని సమాచారం. కాకపోతే ఒక్క చైనా రైట్స్ మాత్రం వీరికి దక్కలేదని తెలుస్తోంది. ఈ మేర డీల్ జరగడమంటే మామూలు విషయం కాదు. ఇది తెలిసి టాలీవుడ్ జనం షాకవుతున్నారు.

దాదాపు 400 కోట్ల భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా పలువురు నటీనటులు పాల్గొంటున్నారు. చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే దాదాపు 22 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఈ సీన్ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే షూట్ చేయనున్నారట.
జక్కన్న చెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఎన్టీఆర్ హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











