RRRలో మహేష్ బాబు.. వినడానికి వింతగా ఉన్నా రాజమౌళి స్కెచ్ ఇదే!!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా RRR. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు, వేస్తున్న స్కెచ్ చూస్తుంటే.. మరో బిగ్గెస్ట్ సినిమా కావడం ఖాయం అని తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఇందులో మహేష్ బాబు కూడా భాగం కాబోతున్నారట. ఆ వివరాలేంటో చూద్దామా..

భారీ ప్రాజెక్టు.. ఓ రేంజ్ అంచనాలు

భారీ ప్రాజెక్టు.. ఓ రేంజ్ అంచనాలు

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్టు ఇదే కావడంతో RRRపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటం ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ ముగ్గురూ దిగ్గజాలే కావడంతో RRR విడుదలపై ఆత్రుత రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఒకదాన్ని మించి మరొకటి

ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఒకదాన్ని మించి మరొకటి

ఇక ఈ సినిమా నుంచి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రావడం, పైగా ఆ అప్‌డేట్ ఒకదాన్ని మించి మరొకటి ఉండటం మెగా, నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. చిత్రంలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్ర రామ్ చరణ్ పోషిస్తున్నాడు.

మహేష్ బాబు సహకారం.. RRR లో సూపర్ స్టార్

మహేష్ బాబు సహకారం.. RRR లో సూపర్ స్టార్

ఇకపోతే ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్న రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు తోడు మరో స్టార్ హీరో మహేష్ బాబు సహకారం కూడా తీసుకోనున్నారట. చిత్రంలో మహేష్ వాయిస్ ఓవర్ పెట్టి RRR రేంజ్ మరింత పెంచేయాలని రాజమౌళి స్కెచ్ వేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమితాబ్ బచ్చన్ కూడా.. RRR సునామీ ఆపేవారే ఉండరు

అమితాబ్ బచ్చన్ కూడా.. RRR సునామీ ఆపేవారే ఉండరు

RRR తెలుగు వర్షన్ కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ తీసుకోబోతున్న రాజమౌళి.. హిందీ వర్షన్ కోసం అమితాబ్ బచ్చన్‌ని తీసుకుంటున్నట్లుగా టాక్. ఇకపోతే తమిళ, మలయాళీ వర్షన్ల కోసం ఆయా ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోల వాయిస్ తీసుకోవాలని రాజమౌళి స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక RRR సునామీ ఆపేవారే ఉండరనడంలో అతిశయోక్తి లేదు.

అజయ్ దేవగణ్ ఎంట్రీ.. ఇదీ పరిస్థితి

అజయ్ దేవగణ్ ఎంట్రీ.. ఇదీ పరిస్థితి

మరోవైపు RRR సినిమా కోసం టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ లాంటి భారీ తారాగణానికి తోడు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి స్టార్ నటీనటులను తీసుకున్నారు జక్కన్న. వారి కోసం ప్రత్యేకంగా పాత్రలు రూపొందించారు. ఇటీవలే అజయ్ దేవగణ్ ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ సెట్స్‌పై ఉంది.

బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు.. రొమాంటిక్ కిక్

బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు.. రొమాంటిక్ కిక్

ఈ మూవీ రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. చారిత్రాక నేపథ్యమున్న సినిమా అయినప్పటికీ రొమాంటిక్ కిక్ కూడా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారట. చిత్రానికి ''రామ రౌద్ర రుషితం'' అనే టైటిల్ పరిశీలనలో పెట్టింది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X