రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (ఆర్ఆర్ఆర్)లో విలన్ ఎవరో తెలుసా?

By Bojja Kumar

Recommended Video

Rajasekhar To Cast As Villain In #RRR

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా మల్టీ స్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. డివివి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు రోజుల క్రితమే అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

రాజమౌళి సినిమాల్లో విలన్

రాజమౌళి సినిమాల్లో విలన్

రాజమౌళి తన సినిమాల్లో హీరోను ఎంత హైలెట్ చేస్తారో... విలన్ పాత్రలను కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా చూపిస్తారు. ఆయన గత చిత్రాలు ఈగలో విలన్‌గా కన్నడ హీరో సుదీప్‌ను చూపించగా, బాహుబలిలో రానాను విలన్ పాత్రలో చూపించారు. #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి విలన్ విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.

రాజశేఖర్ పేరు తెరపైకి

రాజశేఖర్ పేరు తెరపైకి

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజశేఖర్ విలన్ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయ్యాయి. రాజశేఖర్ కూడా గతంలో పలు సందర్భాల్లో తనకు నచ్చే విధంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో రాజశేఖర్ విలన్ అయితే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

 రాజశేఖర్ కూతురు మూవీ ఓపెనింగులో

రాజశేఖర్ కూతురు మూవీ ఓపెనింగులో

ఇటీవల రాజశేఖర్ కూతురును హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీంతో రాజశేఖర్ పేరు #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు బలంగా వినిపిస్తోంది.

#ఆర్ఆర్ఆర్

#ఆర్ఆర్ఆర్

కాగా... డివివి ఎంటర్టెన్మెంట్స్ ‘ఆర్ఆర్ఆర్' పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. అయితే ఇది టైటిల్ కాదని.... రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ముగ్గురి పేర్లు వచ్చేలా ఇలా అనౌన్స్ చేశారట. అఫీషియల్ టైటిల్ ఫైనల్ అయ్యే వరకు ఉపయోగించే తాత్కాలిక పిలుపు మాత్రమే అని చిత్ర యూనిట్ తెలిపారు.

 గ్రాఫిక్స్ లేవు

గ్రాఫిక్స్ లేవు

రాజమౌళి గత చిత్రాలు తీసుకుంటే ఈగ, బాహుబలి, బాహుబలి2 చిత్రాలు భారీగా గ్రాఫిక్స్ వర్క్‌తో కూడిన సినిమాలు. అయితే ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని గ్రాఫిక్స్ జోలికి పోకుండా చిత్రీకరించాలని నిర్ణించారు రాజమౌళి. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X