RRR అప్‌డేట్.. మెగా, నందమూరి అభిమానులు హర్ట్ అయ్యేలా షాకింగ్ న్యూస్

మెగా, నందమూరి అభిమానులు హార్ట్ అయ్యేలా షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తొలిసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి తెర పంచుకుంటున్న RRR సినిమాకు సంబంధించిన అప్‌డేట్ అది. ఇది చేసి షాకవ్వడమే గాక నిరాశకు లోనవుతున్నారు తెలుగు ప్రేక్షకులు.

బాహుబలి సినిమాలో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి బాలీవుడ్ తారాగణం భాగమవుతోంది. ఇటీవలే బల్గెరియాలో షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

 RRR Release Postpone.. Mega, Nandamuri fans Shocked

కాగా ఈ చిత్రం ప్రారంభానికి ముందే 2020 జులై 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా రాజమౌళి ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందట. సో ఈ కారణంగా చిత్ర విడుదల కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే టాక్ మొదలైంది.

RRR విడుదల తేదీని వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తాజా సమాచారం. జులై 30న కాకుండా వచ్చే ఏడాది దసరా సమయానికి లేదా 2021 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం. తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా విడుదలవుతుంది RRR మూవీ. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఉన్నట్టుండి RRR మూవీ విడుదల తేదీ మారిందనే వార్త మెగా, నందమూరి అభిమానులను హార్ట్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X