RRR వాయిదా నిజమే! బలం చేకూర్చిన రామ్ చరణ్ కామెంట్స్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR సినిమా గురించే చర్చించుకుంటున్నారు. దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకుంది. జులై 30న విడుదల చేస్తామని షూటింగ్ ప్రారంభంలోనే ప్రకటించారు జక్కన్న.

అయితే ఇటీవలే ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ఈ సినిమాపై అనుమానాలు రేకెత్తించింది. ''ఎక్స్ క్లూజివ్.. ఈ పెద్ద సినిమా ఏంటో ఊహించండి. దక్షిణాదికి చెందిన బ్లాక్‌బస్టర్ డైరక్టర్ నుంచి వస్తున్న సినిమా అది. త్వరలో ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ కూడా రాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ సినిమా 2020 అక్టోబర్‌లో రాబోతోంది'' అంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR గురించే అనే అనుమానాలు మొదలయ్యాయి.

RRR Release Postpone: Ram Charan Comments

సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఓ మీడియాతో ముచ్చటించిన మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ ఆ అనుమానాలకు రెక్కలు కట్టారు. RRRలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మీడియా సమావేశంలో ఆలియా గురించి అడిగిన ప్రశ్నకు చెర్రీ స్పందిస్తూ.. ''ఆలియా ఇంకా మా షూటింగ్‌కే హాజరు కాలేదు. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు, పాట చిత్రీకరణ జరిగిపోయిందంటూ వచ్చిన వార్తలు నిజం కాదు. మా కాంబినేషన్‌లో షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు'' అని చెప్పారు. దీంతో ఇక RRR జులై 30న రావడం కష్టమే అని అంతా ఫిక్సయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X