ఎన్టీఆర్, రామ్ చరణ్.... అప్పటి వరకు లాక్ అయిపోయారా?

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో బాహుబలి డైరెక్టర్ రాజమౌళి భారీ మల్టీ స్టారర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' అనే తాత్కాలిక టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

నవంబర్ 11న లాంఛనంగా ప్రారంభం అవ్వగా ఆల్రెడీ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. జనవరి మొదటి వారంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం ఉండటం, న్యూఇయర్, సంక్రాంతి నేపథ్యంలో ప్రస్తుతానికి సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

అప్పటి వరకు ఇద్దరినీ లాక్ చేసిన రాజమౌళి

అప్పటి వరకు ఇద్దరినీ లాక్ చేసిన రాజమౌళి

‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ 2019 అక్టోబర్ వరకు లాక్ చేశారట రాజమౌళి. అప్పటి వరకు ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి వచ్చే అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి 2020లో సినిమా విడుదల చేసే అవకాశం ఉంది.

 సంవత్సరం వరకు ఇద్దరి నుంచి ఏ సినిమా రాక పోవచ్చు

సంవత్సరం వరకు ఇద్దరి నుంచి ఏ సినిమా రాక పోవచ్చు

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత' చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. 2020 వరకు ఎన్టీఆర్ నుంచి ఏ సినిమా రాకపోవచ్చు. రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' సంక్రాంతికి విడుదలవుతోంది. దీని తర్వాత మళ్లీ సంవత్సరం వరకు చరణ్ నుంచి ఎలాంటి సినిమా రాదని స్పష్టమవుతోంది.

రేర్ కాంబినేషన్

రేర్ కాంబినేషన్

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఊహించని రేర్ కాంబినేషన్ సెట్ చేసి సంచలనం క్రియేట్ చేశారు రాజమౌళి. గతంలో రాజమౌళి చెర్రీతో ‘మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్ తీయగా... ‘ఆర్ఆర్ఆర్' వీరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం. ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ తర్వాత జక్కన్న చేస్తున్న నాలుగో ప్రాజెక్ట్ ఇది.

అందరిలోనూ ఆసక్తి

అందరిలోనూ ఆసక్తి

రాజమౌళి సినిమాలు ఎవరి ఊహకు అందని విధంగా ఉంటాయి. మరి అలాంటి వ్యక్త ఇద్దరు స్టార్ హీరోలతో రేర్ కాంబినేషన్ సెట్ చేయడంతో కథ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అందిరిలోనూ ఉంది. 1930 బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రం ఉండబోతోందని... ఇందులో స్నేహితులుగా ఉండే వీరు, 2018లో వీరు మళ్లీ పుడతారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X