RRR ఎఫెక్ట్.. ఆచార్యలో రామ్ చరణ్ ఉంటాడో లేదో..?

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య. గత ఏడాది నుంచి సెట్స్ పైన ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తవ్వలేదు. లాక్ డౌన్ తరువాత అయినా స్టార్ట్ చేద్దామని అనుకుంటే కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రిస్క్ వద్దని నిర్మాత రామ్ చరణ్ కూడా షూటింగ్ నిర్వహించడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.

అయితే RRR కారణంగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్రపై ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం రామ్ చరణ్ ని అనుకుంటున్న కొరటాల శివ ఇప్పుడు ఆ పాత్రలో మార్పులు చేసే ఛాన్స్ ఉందట. RRR షూటింగ్ స్టార్ట్ అయితే మరో షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉండదట. దీంతో మెగాస్టార్ కూడా ఆచార్య షూటింగ్ ఆగిపోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 RRR shooting effect on acharya ram charan role

రామ్ చరణ్ కోసం అనుకున్న పాత్రలో వేరే యాక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలని చిరంజీవి దర్శకుడికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టాక్ ఎంతవరకు నిజంమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక త్వరలో సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మణిశర్మ చాలా కాలం తరువాత మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X